పోచారం శ్రీనివాసరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లింది రైతులకోసం కాదు.. ఇసుక, క్రషర్ దందాల కోసం పార్టీ మారాడంటూ జీవన్ రెడ్డి విమర్శించారు.

పోచారం శ్రీనివాసరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Ex-MLA Jeevan Reddy

Jeevan Reddy : బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోచారం పార్టీ మారడం సిగ్గుచేటు. లక్ష్మీ పుత్రుడు అని కేసీఆర్ అంటే.. ఆయన లంక పుత్రుడుగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక నిధులు పొందింది బాన్సువాడ నియోజకవర్గమే.. గత ప్రభుత్వంలో పోచారం ఎంతో లబ్ధి పొందారని జీవన్ రెడ్డి అన్నారు.

Also Read : వెంకట్రామిరెడ్డి ధరణి పేరుతో చేసిన మోసాలు బయటపెడతా: రఘునందన్ రావు

రైతులకోసం ఆయన పార్టీ మారలేదు.. ఇసుక, క్రషర్ దందాల కోసం పోచారం పార్టీ మారారంటూ జీవన్ రెడ్డి విమర్శించారు. అధికారం లేకపోతే ఆయన ఉండలేరా అంటూ ప్రశ్నించారు. రేపు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డినికూడా పోచారం మోసం చేస్తాడని అన్నారు. పార్టీ మారాలనుకున్న నేతలు ఎమ్మెల్యే పదవులకు రాజీనామాచేసి పోవాలని జీవన్ రెడ్డి  సూచించారు.

Also Read : ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. సభలో నవ్వులు పూయించిన పవన్ కల్యాణ్..

మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతూ.. నేను రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ లో చేరుతున్నాఅని అప్పట్లో పోచారం చెప్పారు. తల్లి పాలు తాగే వాళ్లు బీఆర్ఎస్ లో చేరాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ లో ఆయనతో పాటు కొడుకు, వియ్యంకుడు పదవులు అనుభవించారని గణేష్ గుప్తా విమర్శించారు. బీఆర్ఎస్ లో అత్యధికంగా లబ్దిపొందిన వాళ్లే పార్టీ విడుతున్నారు. వీళ్లకు ప్రజలు సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారని అన్నారు. బీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు రాజీనామా చేసి వచ్చారు.. బీఆర్ఎస్ గెలిపించింది. ఇప్పుడు రాజీనామా చేసి వెళ్లి… దమ్ముంటే గెలవాలని గణేష్ గుప్తా పోచారం శ్రీనివాసరెడ్డికి సవాల్ చేశారు.