Varavararao : వరవరరావుకు బెయిల్ గడువు పొడిగింపు
భీమా కోరేగావ్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావుకు ఊరట లభించింది. బెయిల్ గడువును బాంబే హైకోర్టు పొడిగించింది. నవంబర్18 వరకు తలోజా జైలు ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని తెలిపింది.

Varavararao
Bhima Koregaon case : భీమా కోరేగావ్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావుకు స్వల్ప ఊరట లభించింది. బెయిల్ గడువును బాంబే హైకోర్టు పొడిగించింది. నవంబర్ 18 వరకు తలోజా జైలు ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో తన స్వస్థలమైన హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా వరవరరావు కోర్టును కోరారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఈ అంశాన్ని వాయిదా వేసింది. హైదరాబాద్ తరలింపునకు సంబంధించి ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. మరోవైపు వరవరరావు ఆరోగ్యం బాగానే ఉందని, ఆయన్ను హైదరాబాద్ తరలించే అవసరం లేదని హైకోర్టుకు ఎన్ఐఏ వివరించింది. భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన వరవరరావు.. కొన్ని నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు.
KTR : టీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత ప్లేస్ కేటీఆర్‌దేనా..?
ఎన్నో ప్రయత్నాల తరువాత ఆయనకు బెయిల్ మంజూరైంది. బాంబే హైకోర్టు ఫిబ్రవరి 22వ తేదీన షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే, ఇప్పటి వరకు వరవరరావు బెయిల్‌ను కోర్టు మూడుసార్లు పొడిగించింది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. పుణె జిల్లాలోని భీమా కోరెగావ్‌లో 2018 జనవరి 1న హింస చెలరేగింది.
200 ఏళ్ల కింద జరిగిన భీమా కోరేగావ్ యుద్ధాన్ని స్మరించుకునేందుకు ఎల్గర్ పరిషత్ నేతృత్వంలో చేసిన ప్రయత్నం చివరకి అల్లర్లకు దారితీసింది. ఆ అల్లర్లలో ఒకరు మృతి చెందగా, పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు. వీటితో పాటు నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వరవరరావుతో సహా ఐదుగురిని 2018లో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 2020లో ఈ కేసును ఎన్‌ఐఏ చేపట్టింది.