Nirmal : ఇంట్లో తండ్రి మృతదేహం.. టెన్త్ పరీక్షకు హాజరైన కుమారుడు
ఇంట్లో తండ్రి మృతదేహం ఉన్నప్పటికీ అతని చిన్న కొడుకు రోహిత్ సోమవారం టెన్త్ క్లాస్ మొదటి రోజు పరీక్ష రాశాడు. పరీక్ష రాసి వచ్చిన అనంతరం తండ్రి దహన సంస్కారాలు పూర్తి చేశారు.

Nirmal
Nirmal : నిర్మల్ జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో తండ్రి మృతదేహం ఉన్నప్పటికీ కుమారుడు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. దు:ఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాశాడు. ఏడుస్తూనే పరీక్ష కేంద్రానికి వెళ్లి ఎగ్జామ్ రాయడంతో తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. పరీక్ష ప్రారంభానికి ముందు తండ్రిని గుర్తు చేసుకుని విద్యార్థి విలపించడం ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది.
నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దబెల్లాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని మొర్రిగూడెం గ్రామానికి చెందిన తక్కళ్ల వెంకటి(40) ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి చిన్న కొడుకు తక్కళ్ల రోహిత్ తండ్రి మృతదేహం ఇంట్లో ఉన్నా సోమవారం కడెం మండల కేంద్రంలోని జెడ్ పీహెచ్ హైస్కూల్ లో పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు. కొంతకాలంగా తక్కళ్ల వెంకటి అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Narayanpet News: కొడుకు మరణవార్త విని తల్లిదండ్రులు మృతి
కుటుంబ సభ్యులు ఇటీవల ఆయనను నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మృతి చెందాడు. అయితే ఇంట్లో తండ్రి మృతదేహం ఉన్నప్పటికీ అతని చిన్న కొడుకు రోహిత్ సోమవారం టెన్త్ క్లాస్ మొదటి రోజు పరీక్ష రాశాడు. పరీక్ష రాసి వచ్చిన అనంతరం తండ్రి దహన సంస్కారాలు పూర్తి చేశారు.