Minister Sabitha Gunmen : బ్యాంక్ అధికారుల వేధింపులు భరించలేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు : ఫజల్ అలీ కూతురు

వడ్డీ రేట్లు ఎక్కువ వేసి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారని తెలిపారు. వచ్చే జీతం ఈఎంఐలకే పోతుందన్నారు. నాన్నకు ఫోన్ కాల్స్ చేసి రికవరీ వాళ్ళు వేధించారని పేర్కొన్నారు.

Minister Sabitha Gunmen : బ్యాంక్ అధికారుల వేధింపులు భరించలేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు : ఫజల్ అలీ కూతురు

Minister Sabitha Gunman

Updated On : November 5, 2023 / 1:17 PM IST

Minister Sabitha Gunmen Kill : మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ గన్ ఫజల్ అలీ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసింది. బ్యాంక్ అధికారుల వేధింపులు భరించలేక తమ నాన్న ఆత్మ హత్య చేసుకున్నారని ఫజల్ అలీ కూతురు తెలిపారు. హెచ్ డీఎఫ్ సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ లలో లోన్ తీసుకున్నారని తెలిపారు. చాలా వరకు డబ్బులు చెల్లించారని పేర్కొన్నారు.

అయినా వడ్డీ రేట్లు ఎక్కువ వేసి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారని తెలిపారు. వచ్చే జీతం ఈఎంఐలకే పోతుందన్నారు. నాన్నకు ఫోన్ కాల్స్ చేసి రికవరీ వాళ్ళు వేధించారని పేర్కొన్నారు. ఉదయం డ్యూటీకి వెళ్తున్న సమయంలో లో తనను కూడా నాన్న రమ్మన్నారని తెలిపారు. అనేక ఆర్థిక ఇబ్బందులపై కొన్ని విషయాలు తనతో చెప్పారని వెల్లడించారు.

Minister Sabitha Gunman : మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఆత్మహత్య.. కూతురి ముందే గన్ తో కాల్చుకున్న ఫాజిల్

ఇప్పుడే వస్తా అని పక్కకి వెళ్లి తుపాకీకి తో కాల్చుకున్నారని తెలిపారు. నాన్న చనిపోవడంతో తమ కుటుంబం రోడ్డున పడిందన్నారు. తమ నాన్నను వేధించిన బ్యాంక్ ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం, మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. శ్రీనగర్ కాలనీలో గన్ తో కాల్చుకుని ఫజల్ అలీ ఆత్మహత్య చేసుకున్నాడు.

కూతురి ముందే గన్ తో కాల్చుకుని ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన్విర్ హాస్పిటల్ దగ్గరకు కుతుర్ని పిలిపించుకుని అమె ఎదురుగానే గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఫాజిల్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని సమాచారం. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు.

Jabardasth Emmanuel : నేను చచ్చిపోయాను అని రాశారు చేతకాని కొడుకులు.. నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్..

పలు బ్యాంకుల్లో ఫజల్ లోన్ తీసుకున్నరని పోలీసులు పేర్కొన్నారు. లోన్ రికవరీ వేధింపులు తాళలేక ఫజల్ గన్ తో ఫైర్ చేసుకున్నట్లు నిర్ధారించారు. ఇవాళ కూతురును తీసుకుని డ్యూటీకి వచ్చిన ఫజల్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫజల్ ఎస్కార్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు.

ఫజల్ అలీ మృత దేహానికి ఉస్మానియా హాస్పిటల్ లో ఎక్స్ రే పోలీసులు నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో మృతదేహానికి వైద్యులు పోస్టు మార్టం నిర్వహించనున్నారు. ఫజల్ అలీ పాయింట్ బ్లాక్ లో కాల్చుకున్నా బుల్లెట్ దొరకకపోవడంతో పోలీసులు ఎక్స్ రే నిర్వహిస్తున్నారు.