Files Missing : తెలంగాణ పుశుసంవర్ధక శాఖలో ఫైల్స్ మాయం.. కిటికీ గ్రిల్స్ తొలగించి ఎత్తుకెళ్లిన దుండగులు

ఫైల్స్ మాయమైనట్లు అధికారులు గుర్తించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ కు అధికారులు ఫిర్యాదు చేశారు.

Files Missing : తెలంగాణ పుశుసంవర్ధక శాఖలో ఫైల్స్ మాయం.. కిటికీ గ్రిల్స్ తొలగించి ఎత్తుకెళ్లిన దుండగులు

Files Missing

Files Missing : తెలంగాణ పుశుసంవర్ధక శాఖలో ఫైల్స్ మిస్ అయ్యాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఆఫీస్ లో ఫైల్స్ మాయం అయ్యాయి. కిటికీ గ్రిల్స్ తొలగించి దుండగులు ఫైల్స్ ఎత్తుకెళ్లారు. ఫైల్స్ మాయమైనట్లు అధికారులు గుర్తించారు.

ఓఎస్డీ కళ్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఫైల్స్ మాయమైనట్లు అధికారులు గుర్తించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ కు అధికారులు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థంలో డీసీపీ శ్రీనివాస్ ఆధారాలు సేకరించారు.

Gutka Ad Case : ముగ్గురు ప్రముఖ సినీనటులకు కోర్టు నోటీసుల జారీ…ఎందుకంటే…

డైరెక్టర్ ను డీసీపీ శ్రీనివాస్ ప్రశ్నించారు. ఫైల్స్ మాయంపై ఎలాంటి సమాచారం లేదని డైరెక్టర్ తెలిపారు. ఫైల్స్ మాయమవ్వడంపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థలో చోరీకి యత్నించారు.

 

హైదరాబాద్ బషీర్ బాగ్ లోని ఆఫీస్ నుంచి ఫైల్స్ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో ఫైల్స్ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. మీడియా రావడంతో గుర్తు తెలియని వ్యక్తులు పారిపోయారు. గతంలో ఇదే ఆఫీస్ లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాంబర్ ఉంది.