Fire Accident : అగ్నిప్రమాదం.. ఇంట్లో దాచిన రూ.10 లక్షలు దగ్ధం

పూరింటికి నిప్పంటుకోవడంతో పూర్తిగా దగ్దమైంది.. ఈ ప్రమాదంలో ఇంట్లో దాచిన రూ.10 లక్షలు అగ్నికి ఆహుతయ్యాయి.

Fire Accident : అగ్నిప్రమాదం.. ఇంట్లో దాచిన రూ.10 లక్షలు దగ్ధం

Fire Accident

Updated On : October 21, 2021 / 8:44 PM IST

Fire Accident : పూరింటికి నిప్పంటుకోవడంతో పూర్తిగా దగ్దమైంది.. ఈ ప్రమాదంలో ఇంట్లో దాచిన రూ.10 లక్షలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమరి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కప్పల లక్ష్మయ్య.. సన్నకారు రైతు. తనకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ కూలీపనులకు వెళ్తుంటాడు. నాలుగు రోజుల క్రితం తన తండ్రికి చెందిన ఆస్తిని అమ్మడంతో రూ.10 లక్షలు వచ్చాయి. వాటిని ఇంట్లో బీరువాలో పెట్టాడు. గురువారం కుటుంబ సభ్యులు కూలీపనులకు వెళ్లారు.

చదవండి : fire broke in Surat : సూరత్‌లో భారీ అగ్ని ప్రమాదం..భవనం పైనుంచి దూకేసిన కార్మికులు..ఇద్దరు మృతి

ఈ సమయంలోనే ప్రమాదవశాత్తు ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని సమానుతోపాటు బీరువాలో దాచిన రూ.10 లక్షలు కాలిపోయాయి. ఇల్లు పూర్తిగా దగ్దమై పోయింది. ఇక స్థానికుల ద్వారా ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఎవరైనా నిప్పుపెట్టారా? లేదంటే షార్ట్ సర్క్యూట్ వలన అగ్నిప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

చదవండి : Gun Fire: మూత్రం పోస్తుండగా ప్యాంటు జేబులో పేలిన గన్..పరిస్థితి ఎలా ఉందంటే..