Fire Accident: సబ్‌ స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుమ్ముగూడెం మండలం సీతారామపురం సబ్ స్టేషన్ లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. దీనిని గమనించిన సిబ్బంది పోలీసులకు,

Fire Accident: సబ్‌ స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

Fire Accident

Updated On : June 15, 2021 / 12:15 PM IST

Fire Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుమ్ముగూడెం మండలం సీతారామపురం సబ్ స్టేషన్ లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. దీనిని గమనించిన సిబ్బంది పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

కాగా ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంతో సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అగ్నిప్రమాదంలో మొత్తం ట్రాన్స్‌ఫార్మర్లు కాలిబూడిదయ్యాయి. ఆస్తినష్టం భారీగానే జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇక ఘటన స్థలికి చేరుకున్న విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు నష్టాన్ని అంచనా వేసేపనిలో పడ్డారు. విద్యుత్ నిలిచిపోయిన గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Read:Galwan Incident: విషాద ఘటనకు ఏడాది పూర్తి