జీహెచ్ఎంసీలో డ్రైనేజ్ సిస్టమ్ వల్లే వరదలు : కిషన్ రెడ్డి

  • Published By: sreehari ,Published On : October 15, 2020 / 03:16 PM IST
జీహెచ్ఎంసీలో డ్రైనేజ్ సిస్టమ్ వల్లే వరదలు : కిషన్ రెడ్డి

Updated On : October 15, 2020 / 3:55 PM IST

Kishan Reddy : తెలంగాణలో అధికంగా వర్షాలు కురిశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీలో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్లే వరదలు వచ్చాయని ఆయన చెప్పారు.




డ్రైనేజ్ లో ఇసుక, మట్టి ఉండటం వల్ల నీరు బయటకు వెళ్లడం లేదన్నారు. జీహెచ్ఎంసీ డ్రైనేజీ వ్యవస్థలో లోపాలు కారణంగానే ఈసమస్య తలెత్తిందని చెప్పారు.

ప్రభుత్వ యంత్రాంగం వల్ల ప్రజలకు పూర్తి స్థాయి మేలు జరగలదేన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలకు సహాయం చేయాలని కిషన్ రెడ్డి సూచించారు.




మరోవైపు.. హైదరాబాద్‌లో వరద బీభత్సం సృష్టించింది. ప్రాణ‌న‌ష్టం కూడా భారీ సంఖ్యలోనే ఉంది. 24 గంట‌ల్లో 30మందికి పైగా వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.

పల్లె చెరువులో ఆరుగురి మృతదేహాలు గుర్తించారు. మరో 9 మంది గల్లంతయ్యారు.. ఎస్ఆర్ న‌గ‌ర్‌లో ఇద్దరు మృతిచెంద‌గా.. దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో మూడేళ్ల చిన్నారి సెల్లార్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది.