స్కూల్ లో కలకలం : ఉప్మా తిని 100మంది విద్యార్థులకు అస్వస్థత
రిపబ్లిక్ డే రోజున ప్రభుత్వ పాఠశాలలో అనుకోని ఘటన జరిగింది. నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం కర్నిలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఉప్మా తిని 100

రిపబ్లిక్ డే రోజున ప్రభుత్వ పాఠశాలలో అనుకోని ఘటన జరిగింది. నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం కర్నిలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఉప్మా తిని 100
రిపబ్లిక్ డే రోజున ప్రభుత్వ పాఠశాలలో అనుకోని ఘటన జరిగింది. నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం కర్నిలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఉప్మా తిని 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. కొందరు కళ్లు తిరిగి పడిపోయారు. కొందరు కడుపు నొప్పితో బాధపడుతున్నారు.
వెంటనే స్పందించిన టీచర్లు.. విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు.
ప్రభుత్వానికి చెందిన హాస్టల్స్ లో తరుచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు. ఎక్కువ శాతం అపరిశుభ్రత వల్లే ఇలా జరుగుతున్నట్టు అధికారుల విచారణలో తేలింది. పాత్రలు సరిగా కడక్కపోవడం, శుభ్రత పాటించకపోవడం కారణం అవుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పొరపాట్లు రిపీట్ అవుతూనే ఉన్నాయి. విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. ఇలాంటి ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.