ఇడ్లీలో జెర్రి ఎఫెక్ట్.. జగిత్యాల పట్టణంలో ఉడిపి హోటల్‌ని సీజ్ చేసిన అధికారులు..

నిన్న ఇడ్లీలో జెర్రి రావడంతో మహిళ హోటల్ నిర్వాహకులను ప్రశ్నించింది.

ఇడ్లీలో జెర్రి ఎఫెక్ట్.. జగిత్యాల పట్టణంలో ఉడిపి హోటల్‌ని సీజ్ చేసిన అధికారులు..

Updated On : October 14, 2024 / 5:49 PM IST

Udupi Hotel Seized : జగిత్యాల పట్టణంలోని గణేశ్ భవన్ ఉడిపి హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. నిన్న హోటల్ లో ఇడ్లీలో జెర్రి రాగా ఓ మహిళా కస్టమర్ ఆందోళన చేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ ఆ హోటల్ లో తనిఖీలు చేశారు. నిబంధనల మేరకు నిర్వహణ లేకపోవడంతో హోటల్ ను సీజ్ చేశారు అధికారులు.

నిన్న ఇడ్లీలో జెర్రి రావడంతో మహిళ హోటల్ నిర్వాహకులను ప్రశ్నించింది. హోటల్ నిర్వాహకులు అది జెర్రి కాదని బుకాయించగా.. హోటలో ముందు ఆమె ఆందోళన చేపట్టింది. ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో ఇవాళ హోటల్ లో తనిఖీలు చేశారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు.. హోటల్ ను సీజ్ చేశారు.

”ఇడ్లీలో జెర్రి వచ్చిందని మాకు ఫిర్యాదు అందింది. అందుకు రెస్పాండ్ అవుతూ ఇవాళ మేము హోటల్ లో తనిఖీలు చేశాము. ఇది పబ్లిక్ హెల్త్ ఇష్యూ. కాబట్టి హోటల్ ని సీజ్ చేస్తున్నాము. శానిటరీ మెజర్స్, ఇతర సమస్యలు అన్నీ రెక్టిఫై చేశాకే హోటల్ ను ఓపెన్ చేసేందుకు పర్మిషన్ ఇస్తాము. పలు సెక్షన్ల కింద కేసులు బుక్ అయ్యాయి. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా మేము కొన్ని సూచనలు చేశాం. అవన్నీ చేయాల్సి ఉంటుంది. మేము మళ్లీ చెక్ చేస్తాం. మేము సంతృప్తి చెందితేనే మళ్లీ హోటల్ ని ఓపెన్ చేపిస్తాం” అని ఫుడ్ సేఫ్టీ ఇన్ స్పెక్టర్ అనూష తెలిపారు.

 

Also Read : ఈ సారి హైదరాబాదీలు చలికి వణికిపోవాల్సిందే.. ఐఎండీ ఏం చెప్పిందంటే?