ఎమరాల్డ్ స్వీట్ హౌస్‌లో ఫుడ్ సేఫ్టీ సోదాలు.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు

నేతి మిఠాయిలు తయారు చేసే స్వీట్ హౌస్ కిచెన్ లో అపరిశుభ్ర వాతావరణం ఉందని అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఎమరాల్డ్ స్వీట్ హౌస్‌లో ఫుడ్ సేఫ్టీ సోదాలు.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు

Emerald Sweet House Raids : హైదరాబాద్ ఇందిరా పార్క్ పక్కన ఉన్న ఎమరాల్డ్ స్వీట్ హౌస్ పై ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రమాదకర కెమికల్స్ మిక్స్ అయిన 60 కేజీల బెల్లం, సరిగా లేని 3 కిలోల జీడిపప్పును అధికారులు సీజ్ చేశారు. మిఠాయిల్లో వాడే ముడిసరుకులకు సరైన లేబ్లింగ్ లేనట్లు గుర్తించారు. సీజ్ చేసిన శాంపుల్స్ ను ల్యాబ్ కు తరలించారు. నేతి మిఠాయిలు తయారు చేసే స్వీట్ హౌస్ కిచెన్ లో అపరిశుభ్ర వాతావరణం ఉందని అధికారులు నోటీసులు జారీ చేశారు.

అలాగే మెడికల్ సర్టిఫికెట్లు లేని ఫుడ్ హ్యాండలర్స్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే సరైన లేబ్లింగ్ లేని వాటర్ క్యాన్స్ గుర్తించారు. మరోవైపు తాము సక్రమంగానే స్వీట్లు తయారు చేస్తున్నామని, అధికారుల తనిఖీలకు తాము అడ్డురామని ఎమరాల్డ్ స్వీట్స్ నిర్వాహకులు తెలిపారు.

హైదరాబాద్ నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్ పై ఫోకస్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా స్వీట్ హౌస్ లపైనా దృష్టి సారించారు. ఎమరాల్డ్ స్వీట్ హౌస్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఎమరాల్డ్ స్వీట్ హౌస్ చాలా ఫేమస్. ఇక్కడ ఎంతో నాణ్యంగా, ఎలాంటి కెమికల్స్ వాడకుండా స్వీట్స్ చేస్తారని గుర్తింపు ఉంది. అయితే, ఈ స్వీట్ షాపులో అధికారుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. లేబులింగ్ లేని ఆహార పదార్ధాలు, వాటర్ క్యాన్లు, బెల్లంను గుర్తించారు. లేబులింగ్ లేకుండా ఉపయోగించడం ఆహార భద్రత నిబంధనలకు విరుద్ధం. వీటికి సంబంధించి కొన్ని శాంపుల్స్ ను సేకరించారు. అలాగే, అక్కడ పని చేస్తున్న సిబ్బందికి మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు లేనట్లుగా గుర్తించారు.

సాధారణంగా స్వీట్ షాప్స్ లో పని చేసే సిబ్బంది కచ్చితంగా మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి. వాళ్లకు ఎలాంటి రోగాలు లేవు, చర్మ వ్యాధులు లేవు అని నిర్ధారిస్తూ మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి. అయితే, ఎమరాల్డ్ స్వీట్ హౌస్ లో పని చేసే సిబ్బందికి మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు లేని అంశాన్ని అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు. ఈ క్రమంలో నోటీసులు ఇచ్చారు.

హైదరాబాద్ నగరంలో పెద్ద సంఖ్యలో స్వీట్ హౌస్ లు ఉన్నాయి. అయితే, చాలావరకు స్వీట్ షాపుల్లో కెమికల్స్ వాడుతున్నారనే ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలకు దిగారు.

Also Read : సందీప్ కిషన్ రెస్టారెంట్‌లో తనిఖీలు.. బయటపడ్డ షాకింగ్ విషయాలు