కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకలు.. ఫ్రీజర్‌లో కుళ్లిన చికెన్, మటన్.. హైదరాబాద్ హోటల్స్, రెస్టారెంట్లలో దారుణ పరిస్థితులు

హోటల్స్, రెస్టారెంట్లు నిబంధనలు పాటించకుండా కుళ్లిన ఆహార పదార్ధాలతో కసమర్ల అనారోగ్యానికి కారణం అవుతున్నాయని అధికారులు చెప్పారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మరికొన్నింటికి భారీగా జరిమానా విధించారు.

కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకలు.. ఫ్రీజర్‌లో కుళ్లిన చికెన్, మటన్.. హైదరాబాద్ హోటల్స్, రెస్టారెంట్లలో దారుణ పరిస్థితులు

Raids In Hotels : హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లోని హోటల్స్, రెస్టారెంట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగుచూస్తున్నాయి. అమీర్ పేట్ లోని రెబల్ ఫుట్ రెస్టారెంట్ లో ఫ్రీజర్ లో కుళ్లిన మటన్, చికెన్ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఆహార పదార్ధాల్లో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు వెల్లడైంది.

అంతేకాదు కిచెన్ లో వాతావరణం చాలా దారుణంగా ఉందని అధికారులు తెలిపారు. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు యధేచ్చగా తిరుగుతూ కనిపించాయి. కిచెన్ వాతావరణం పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నట్లుగా వెల్లడించారు. ఇక సికింద్రాబాద్ లోని వివాహభోజనంబు, గ్రిల్ నైన్ హోటల్స్ లో అధికారులు సోదాలు జరిపారు. అక్కడ కూడా సేమ్ సీన్. కుళ్లిన ఆహార పదార్ధాలు దర్శనం ఇచ్చాయి. అంతేకాదు 2022లోనే గడువు తీరిన 25 కిలోల చిట్టి ముత్యాల రైస్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్స్ పైర్ అయిన 35 ప్యాకెట్ల మసాలాలు గుర్తించారు.

సింథటిక్ ఫుడ్ కలర్స్ మిక్స్ చేసిన కొబ్బరి తురుము వినియోగిస్తున్నట్లు గుర్తించారు. హోటల్స్, రెస్టారెంట్లు నిబంధనలు పాటించకుండా కుళ్లిన ఆహార పదార్ధాలతో కసమర్ల అనారోగ్యానికి కారణం అవుతున్నాయని అధికారులు చెప్పారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మరికొన్నింటికి భారీగా జరిమానా విధించారు.

Also Read : హైదరాబాద్ జూ పార్క్‌లో కలకలం.. ఒక్కసారిగా దాడి చేసిన సింహం, భయాందోళనలో సందర్శకులు..