బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి: వీహెచ్ డిమాండ్

కంగనా రనౌత్‌పై అంబర్ పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయించామని, ఆమెలాంటి వారిని బీజేపీ ప్రోత్సహిస్తే..

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి: వీహెచ్ డిమాండ్

Vh

బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ అనేక ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. ఓ మహిళా సీఆర్పీఎఫ్ అధికారి చెంపదెబ్బ కొట్టినా కంగనా రనౌత్ మారడం లేదని విమర్శించారు.

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గురువారం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి డ్రగ్స్ అలవాటు ఉందంటూ అనేక ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పారు. రాహుల్ గాంధీ చెత్త ప్రసంగాలు చేస్తారంటూ ఆమె కామెంట్లు చేయడంతో తాము బాధపడ్డాయని వీహెచ్ అన్నారు.

కంగనా రనౌత్‌పై అంబర్ పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయించామని, ఆమెలాంటి వారిని బీజేపీ ప్రోత్సహిస్తే ప్రజలు తిరగబడుతారని చెప్పారు. కంగనా రనౌత్‌ను నియంత్రించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మీద ఉందని అన్నారు. కంగనా రనౌత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు. కేసులు నమోదు చేయాలని డీజీపీ, కమిషనర్లకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై స్పందిస్తూ.. హైడ్రా అధికారి రంగనాథ్ మంచి పనిచేస్తున్నారని, ఆయనను అభినందిస్తున్నానని చెప్పారు. ఒకవేళ పేదల ఇండ్లు కూల్చితే, వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని సూచించారు.

Also Read: వైసీపీని వీడుతున్న కీలక నేతల గురించి మాజీ మంత్రులు అంబటి, కాకాణి ఏమన్నారో తెలుసా?