ఈటల మాటల ఈటెలు : అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు..హుజురాబాద్‌లో మీ రాజకీయాలు నడవవు..

Ex Minister Etela Rajender
ex minister etela rajender : తెలంగాణ మాజీ ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ స్వరం పెంచారు. పరోక్షంగాను..ప్రత్యక్ష్యంగా ప్రభుత్వంపై మాటల దాడి చేస్తున్నారు. వరుస ప్రెస్ మీట్ లతో ప్రభుత్వంమీదా..సీఎం కేసీఆర్ మీద కూడా విమర్శలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈటల మాట్లాడుతూ..నామీద కక్ష కట్టి కావాలని నన్ను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేశారనీ..చేస్తున్నారనీ..నన్ను ఇబ్బంది పెట్టిన ఫరవాలేదు…కానీ ప్రజల్ని మాత్రం ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. నా మీద కక్షతో నా మద్దతుదారుల్ని కూడా సమస్యలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
అధికారంలో ఉన్నారు కదాని ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారనీ..కానీ అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని తెలుసుకోవాలని సూచించారు. కరీనగరం జిల్లాను బొందల గడ్డగా మారిందనీ..హుజురాబాద్‌లో మీ రాజకీయాలు నవవవని గుర్తించుకోండని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాగా భూ కజ్జా చేశారనే ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేశాక ప్రభుత్వం ఈట రాజేందర్ భూ కబ్జా కేసు విచారణ వేగవంతం అయ్యింది. కేసు విచారణను ఏసీబీ అధికారులు ముమ్మరం చేశారు. జమున హెచరీస్ కంపెనీ నిర్మాణం కోసం 2018లో ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఇంచార్జ్ తహసీల్దార్ సురేష్, మాలతి తెలిపారు. హకీంపేట 111 సర్వేనెంబర్‌లో అనుమతి లేకుండా షెడ్ల నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. దీనిపై పంచాయతీ సెక్రటరీ రెండుసార్లు నోటీసు ఇచ్చారని వారు తెలిపారు. ఈ క్రమంలో ఈటలకు టీఆర్ఎస్ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా మంత్రి గంగుల కమలాకర్ కు ఈటలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.