గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో కుప్పకూలిన తెలంగాణ మాజీ హోమ్ మంత్రి

Mahmood Ali: గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో అస్వస్థతకు గురైన తెలంగాణ మాజీ హోంమంత్రి, BRS నేత మహమూద్‌అలీ

గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో కుప్పకూలిన తెలంగాణ మాజీ హోమ్ మంత్రి

Updated On : January 26, 2024 / 2:17 PM IST

గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న మాజీ హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. ఆయ‌న స్పృహ త‌ప్పి కింద‌ప‌డిపోయారు. వెంట‌నే ఆయ‌న్ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని తెలంగాణ భ‌వ‌న్‌లో శుక్ర‌వారం వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మహమూద్ అలీ స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. వెంట‌నే ప‌క్క‌న ఉన్న‌వారు, సిబ్బంది ఆయ‌న‌కు ప్రాథ‌మిక చికిత్స అందించారు. అనంత‌రం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

కాగా.. ప్రస్తుతం మాజీ మంత్రి మహమూద్ అలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని అనుచరులు మీడియాకు తెలియజేసారు.