Hyderabad : గచ్చిబౌలిలో టిప్పర్ బీభత్సం.. నుజ్జు నుజ్జయిన వాహనాలు..డెలివరీ బాయ్ మృతి
గచ్చిబౌలిలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. రెడ్ సిగ్నల్ వద్ద ఆగివున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో కార్లు, బైకులు నుజ్జు నుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ డెలివరీ బాయ్ మృతి చెందాడు.

Gachibowli Tipper Incident..One died In Hyderabad
Gachibowli Tipper Incident..One died : గచ్చిబౌలిలోని విప్రో(Gachibowli Wipro) సమీపంలో టిప్పర్ బీభత్సం సృష్టించింది.రెడ్ సిగ్నల్(Red signal) పడటంతో ఆగివున్న వాహనాలను టిప్పర్ ఢీకొట్టింది. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈఘటనలో నాలుగు కార్లు నుజ్జునుజ్జు కాగా, 2 బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పొట్టకూటికోసం ఫుడ్ డెలివరీ చేస్తున్న ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్ నసీర్(Food delivery boy Naseer) అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ బీభత్సానికి మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి(Hospital) తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) ఘటన స్థలానికి చేరుకుని పరిశీలీంచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో టిప్పర్ అదుపుతప్పినట్లు పోలీసులు చెబుతున్నారు.