Gaddar Daughter Vennela
Gaddar Daughter Vennela : ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల ప్రకటించారు. ‘మా అన్న సూర్యం చాలా సెన్సిటివ్ అందుకే ఎలక్షన్ కు దూరంగా ఉంటారు. నేను అలా కాదు ధైర్యవంతురాలిని అందుకే ఎన్నికల్లో నిలబడాలని అనుకుంటున్నా అంటూ తెలిపారు. వెన్నులో బుల్లెట్ ఉన్నా తన తండ్రి గద్దర్ జనం కోసం పరితపించారని గుర్తు చేశారు. 2023లో తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని గద్దర్ చెప్పారనే విషయాన్ని ఈ సందర్భంగా వెన్నెల గుర్తు చేశారు. తన తండ్రి ఆశించినట్లుగా తాను ఎన్నికల బరిలో నిలుస్తున్నానని తెలిపారు.
కాంగ్రెస్ అవకాశం ఇస్తే.. కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానని ..కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోటీ చేయటం ఖాయం అని స్పష్టంచేశారు. 40 ఏళ్ల నుంచి పార్టీకి పని చేస్తున్న వారికి మనవి చేస్తున్న.. మీ బిడ్డగా అందరిని కలుపుకొని వెళ్తానని అన్నారు. చాలామంది తాము పోటీకి సుముఖంగా లేమని ప్రచారం చేస్తున్నారు.. కానీ తాము పోటీకి రెడీ ఉన్నామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే పోటీ చేస్తానని ప్రకటించిన వెన్నెల కాంగ్రెస్ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారో వివరించారు. కాంగ్రెస్ నుంచే పోటీ చేయడానికి కారణం ఉందన్నారు. తన తండ్రి గద్దర్ ను కాంగ్రెస్ చేరదీసిందని అండగా ఉంటామని చెప్పిందని అందుకే ఈ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపారు .రాహుల్ గాంధీ..పేదలను అక్కున చేర్చుకుంటున్నారని అన్నారు. సోనియా గాంధీ.. తెలంగాణ త్యాగాల కోసం రాష్ట్రం ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
MLC Kavita : రాహుల్ గాంధీ మీ స్క్రిప్ట్ రైటర్ని మార్చుకోండి : కవిత సెటైర్లు
గద్దర్ త్యాగాల మేరకు మా కుటుంబానికి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని భావిస్తున్నామని వెన్నెల ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత పది రోజులుగా కంటోన్మెంట్లో పనిచేస్తున్నానని కాంగ్రెస్ లో తనకు సభ్యత్వం లేదు.. కానీ కాంగ్రెస్ సానుభూతి పరులం..అని అన్నారు. కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఓకే.. టికెట్ ఇవ్వకపోయినా ఎన్నికల్లో నిలవాలని భావిస్తున్నానని అన్నారు. ఈ విషయంపై గద్దర్ భార్య విమల మాట్లాడుతు..తన కుమార్తె విమలకు కాంగ్రెస్ టికెట్ ఇస్తాను అని అన్నారని కానీ ఇప్పుడు మాత్రం ఆ మాటే ఎత్తటం లేదని అంటూ ఆరోపించారు. తనకు కుమార్తెకు టికెట్ ఇస్తే తాను ఎన్నికల్లో ప్రచారం చేస్తానని తెలిపారు.