తేజేశ్వర్ హత్యకేసులో బిగ్ ట్విస్ట్.. చంపేసి ఫారెన్ పారిపోవడానికి ప్లాన్.. బయటపడిందిలా..
తేజేశ్వర్ ను పెళ్లి చేసుకున్న తరువాత కర్నూలులో కాపురం పెడదామని ఐశ్వర్య ఒత్తిడి తెచ్చింది. అందుకు తేజేశ్వర్ ఒప్పుకోకపోవడంతో అతన్ని హత్య చేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది.

Gadwal land surveyor tejeswar case
Ggadwal land surveyor tejeswar case updates: గద్వాలకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు దర్యాప్తులో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తేజేశ్వర్ ను హత్య చేసిన తరువాత తిరుమలరావు, ఐశ్వర్య ఇద్దరూ లద్ధాక్ వెళ్లి.. అక్కడి నుంచి విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం రెండు విమాన వికెట్లు బుక్ చేసుకోవడంతోపాటు.. రూ.2లక్షలు సమకూర్చుకున్నారు.
ఐశ్వర్య తల్లి సుజాత కర్నూల్‌లోని ఒక బ్యాంకులో స్పీపర్ గా పనిచేస్తుండగా.. బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ తరువాత అతడు ఆమె కుమార్తెతోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తొలుత తిరుమలరావు, ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే, అంతకుముందే అతనికి పెళ్లికావడంతో ఐశ్వర్యతో వివాహం సాధ్యం కాలేదు. దీంతో తన భార్యను హత్యచేసి ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని భావించాడు. అదే సమయంలో గద్వాల్ పట్టణానికి చెందిన తేజేశ్వర్ తో ఐశ్వర్యకు వివాహం జరిగింది.
Also Read: సిగ్నల్ వైర్లు కత్తిరించి.. రైలులో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. ఏపీలో ఘటన
తేజేశ్వర్ ను పెళ్లి చేసుకున్న తరువాత కర్నూలులో కాపురం పెడదామని ఐశ్వర్య ఒత్తిడి తెచ్చింది. అందుకు తేజేశ్వర్ ఒప్పుకోకపోవడంతో అతన్ని హత్య చేయాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. తేజేశ్వర్ ను హత్య చేసిన తరువాత విదేశాలకు పారిపోవాలని తిరుమలరావు, ఐశ్వర్య అనుకున్నారు.
ఇందుకోసం బ్యాంకులో రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందు లద్ధాఖ్ వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందుకోసం విమానం టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. ఆ తరువాత తేజేశ్వర్ ను హత్యచేసేందుకు సుపారీ గ్యాంగ్‌కు రూ.2లక్షలు ఇచ్చారు.
ఈనెల 17న తేజేశ్వర్‌ను హత్యచేసిన సుపారీ గ్యాంగ్ పాణ్యం వైపు వెళ్లి అడవిలో పడేశారు. ఈ ఘటన వెలుగులోకి రాకముందే విదేశాలకు పారిపోయేందుకు తిరుమలరావు, ఐశ్వర్య సిద్ధమయ్యారు. తేజేశ్వర్ కనిపించకపోవటంతో అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐశ్వర్యపైనే అనుమానం ఉందని పోలీసులకు చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఐశ్వర్యను పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాత తిరుమలరావు ఒక్కడే విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.