Old City: పాతబస్తీలో గ్యాంగ్ వార్

చిన్న వివాదం రెండు గ్యాంగ్ ల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Old City: పాతబస్తీలో గ్యాంగ్ వార్

Old City

Updated On : June 7, 2021 / 11:07 AM IST

Old City: రెండు గ్రూపుల మధ్య తగాదా కాస్త గ్యాంగ్‌వార్‌గా మారిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు గ్రూపులు.. గ్యాంగ్‌లుగా మారి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.

ఈ ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలు అవ్వగా.. ఘటన స్థలంలోనే వ్యక్తి కుప్పకూలిపోయాడు. అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు గ్యాంగ్ వార్ విషయం తెలుసుకుని ఘటన స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఈ ప్రదేశంలో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి ఘర్షణకు దిగిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.