Yapral Ganja : అబ్బా..ఏం తెలివి…ఇంట్లోనే పూల కుండీల్లో గంజాయి సాగు

గంజాయిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఓ ప్రబుద్దుడు ఇంట్లోనే గంజాయి సాగు ప్రారంభించాడు. ఎవరికి అనుమానం రాకుండా పూల కుండీల్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడు.

Yapral Ganja : అబ్బా..ఏం తెలివి…ఇంట్లోనే పూల కుండీల్లో గంజాయి సాగు

Ganja Yapral

Updated On : November 8, 2021 / 12:47 PM IST

Ganja Farming In Flower Pot : గంజాయిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఓ ప్రబుద్దుడు ఇంట్లోనే గంజాయి సాగు ప్రారంభించాడు. ఎవరికి అనుమానం రాకుండా పూల కుండీల్లోనే గంజాయి మొక్కలు పెంచి సొంతానికి వాడుకుంటన్న వ్యవహారం సికింద్రాబాద్ యాప్రాల్ లో వెలుగు చూసింది. బయట ఎవరి దగ్గరనో కొనడం.. దానిని తెచ్చుకుంటూ పోలీసు తనిఖీల్లో దొరకడం ఎందుకు..? ఏకంగా తానే గంజాయి మొక్కలు పెంచి, అవసరానికి వాడుకుని ఆపై కావాల్సిన వారికి అమ్మితే ఆదాయం కూడా వస్తుంది కదా..? అనుకున్నాడో వ్యక్తి.

Read More : Yamuna River : మంచు కాదు..పాలపొంగులు కావు..మరేంటి ?

ఆలోచన వచ్చిందే తడవుగా మొక్కలు తెచ్చి.. ఇంటిపై కుండీల్లో సాగు చేయడం ప్రారంభించాడు. హైదరాబాద్‌ జవహర్‌నగర్‌కు చెందిన  వ్యక్తి నిర్వాకమిది. స్థానికంగా బేకరీ నడిపే పిల్లుట్ల వెంకట నర్సింహశాస్త్రి కొన్నాళ్ల క్రితం కుటుంబంతో పాటు నేరేడ్‌మెట్‌ డివిజన్‌ యాప్రాల్‌ గోదావరి గార్డెన్‌లో ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. ఇతనికి గంజాయి తీసుకొనే అలవాటుంది. అయితే, ఇటీవల పోలీసు నిఘా పెరగడంతో సరుకు లభించడం కష్టంగా మారింది. వ్యసనం వీడలేని నర్సింహ శాస్త్రి ఇంటిపైనే మొక్కలు పెంచడం మొదలుపెట్టాడు.

Read More : PV Sindhu Padma Bhushan : రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా..ప‌ద్మ‌భూష‌ణ్‌ అవార్డు అందుకున్న పీవీ సింధు

ఇందుకు కొత్తగా కుండీలు కొని ఏడు మొక్కలు వేశాడు. ఇంటి యజమాని విదేశాల్లో ఉండడంతో పట్టించుకునేవారు లేరు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న జవహర్‌నగర్‌ పోలీసులు తనిఖీ చేశారు. కుండీల్లో 4 అడుగుల మేర పెరిగిన గంజాయి మొక్కలను గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేశారు. కొద్ది రోజుల వ్యవధిలోనే వందల కిలోల గంజాయితోపాటు పదుల సంఖ్యలో విక్రేతలను, సరఫరాదారులను పోలీసులు అరెస్టు చేశారు.