PV Sindhu Padma Bhushan : రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా..ప‌ద్మ‌భూష‌ణ్‌ అవార్డు అందుకున్న పీవీ సింధు

బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌ పీవీ సింధు పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా పద్మవిభూషన్ అవార్డు అందుకున్నారు.

PV Sindhu Padma Bhushan :  రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా..ప‌ద్మ‌భూష‌ణ్‌ అవార్డు అందుకున్న పీవీ సింధు

Pv Sindhu Padma Bhushan

pv sindhu awarded the padma bhushan  : 2016 రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ‘వెండి కొండ’ తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన పీవీ సింధు పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా పూసర్ల వెంకట సింధు పద్మవిభూషన్ అవార్డు అందుకున్నారు. 2020 సంవ‌త్సరానికి గాను పీవీ సింధుకి పద్మవిభూషణ్ అవార్డు వరించింది. ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి కోవింద్ చేతుల మీదుగా ఆమె ఆ అవార్డును స్వీక‌రించారు సింధు. ఒలింపిక్ ప్లేయ‌ర్ పుస‌ర్ల వెంక‌ట సింధు రియోలో జ‌రిగిన ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ ప‌త‌కం గెల‌వ‌గా.. ఇటీవ‌ల టోక్యోలో జ‌రిగిన ఒలింపిక్స్ గేమ్స్‌లో ఆమె బ్రాంజ్ మెడ‌ల్‌ను గెలుచుకుంది సింధు. 2015లో సింధుకు ప‌ద్మ‌శ్రీ అవార్డు ద‌క్కింది.

Read more :  Bus fares reduced : సామాన్యులకు గుడ్ న్యూస్..బస్సు చార్జీలు తగ్గింపు

ఈ పద్మ అవార్డుల కార్యక్రమంలో వైద్య రంగంలో ప‌ద్మ‌శ్రీ అవార్డు గెలుచుకున్న ఎయిర్ మార్ష‌ల్ డాక్ట‌ర్ ప‌ద్మ భందోపాధ్యాయ కూడా రాష్ట్ర‌ప‌తి కోవింద్ చేతుల మీదుగా ఆమెఅవార్డును అందుకున్నారు. కాగా..ఈ ఏడాది ప్ర‌భుత్వం 119 ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దాంట్లో ఏడు ప‌ద్మ విభూష‌ణ్‌, ప‌ది ప‌ద్మ‌భూష‌ణ్‌, 102 ప‌ద్మ‌శ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డులు అందుకున్న‌వారిలో 29 మంది మ‌హిళ‌లు ఉన్నారు. మ‌రో 16 మందికి మ‌ర‌ణానంత‌రం అవార్డుల‌ను ఇచ్చారు. ప‌ద్మ అవార్డులు స్వీక‌రించిన వారిలో ఓ ట్రాన్స్‌జెండ‌ర్ కూడా ఉన్నారు.

Read more : LK Advani 94th Birthday : LK అద్వానీ 94వ పుట్టిన రోజు..కేక్ కట్ చేయించిన బీజేపీ అగ్రనేతలు

కాగా..పీవీ సింధుకి 2012 సెప్టెంబరు 21 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన స్థానాల్లో మొదటి 20 క్రీడాకారిణుల జాబితాలో చోటు దక్కించుకోవడంతో మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఆగస్టు 10 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి, ఆ పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 2015 మార్చి 30 న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది. 2016 ఆగస్టు 18 న రియో ఒలింపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్ కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించి ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తరువాత జరిగిన ఫైనల్లో రజత పతకం సాధించి, ఒలింపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది పీవీ సింధు.