Bus fares reduced : సామాన్యులకు గుడ్ న్యూస్..బస్సు చార్జీలు తగ్గింపు

సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్స్సు చెప్పింది. బస్ చార్జీలు తగ్గించింది. ఎక్కడంటే..

Bus fares reduced : సామాన్యులకు గుడ్ న్యూస్..బస్సు చార్జీలు తగ్గింపు

Bus Fares Reduced (1)

Bus fares reduced : మన తెలుగు రాష్ట్రాల్లో బస్సు చార్జీలు పెంచుతుంటే ఒడిశా ప్రభుత్వం మాత్రం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. బస్సు చార్జీలు తగ్గిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌, వ్యాట్‌ తగ్గించటంతో ఒడిశా ఆర్టీసీ, ప్రైవేటు ఆపరేటర్లు బస్సు ఛార్జీలు తగ్గించారు. తగ్గించిన ఈ చార్జీలు శనివారం (నవంబర్ 7,2021) నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు కిలోమీటరుకు 5 పైసలు, ఏసీ, డీలక్స్‌ బస్సులు 10 పైసలు, సూపర్‌ ప్రీమియం ఛార్జీలు 17 పైసలు తగ్గాయి. ఛార్జీల పెంపు, తగ్గింపు అంతా ఇంధన ధరలను బట్టి ఆటోమేటిక్‌ సిస్టం ద్వారా జరుగుతోంది. చార్జీలు తగ్గటంతో ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

Read more : TSRTC : తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్, త్వరలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ?

ఒడిశా ప్రభుత్వం చార్జీలు తగ్గించింది. కానీ మనతెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆర్టీసి నష్టాల్లో ఉందంటూ చార్జీలు పెంచుకుంటు పోతున్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనర్ ఆర్టీసీ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసి నష్టాల్లో ఉంది కాబట్టి చార్జీలు పెంచక తప్పనిసరి అంటున్నారు. దీంట్లో భాగంగానే త్వరలో బస్సు ఛార్జీలు పెరుగుతాయని బాంబు పేల్చారు సజ్జనార్. డీజిల్ ధరలు పెరగడంతో బస్ ఛార్జీలు కూడా పెంచే ఆలోచన ఉందని ఆయన తెలిపారు.

కాగా సజ్జనార్ ఆర్టీసి ఎండీగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టారు. 20వ తేదీన వచ్చే ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు సజ్జనార్ చేరాక 1వ తేదీకే పడేలా చేస్తున్నారు. ఎండీ అంటే కేవలం ఆఫీసుకే పరిమితం కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ… ఎక్కడికక్కడ తనిఖీలు సోదాలు నిర్వహిస్తున్నారు. కానీ బస్సు చార్జీలు పెరుగుతాయని చెప్పి ప్రజలకు మాత్రం షాక్ ఇచ్చారు.

Read more : Telangana : ఆర్టీసీ ఛార్జీల పెంపు..సంస్థ ప్రతిపాదనలివే