తెలంగాణ సీఎస్‌కు, పలువురు IASలకు మధ్య గ్యాప్..!
ఈ విభేదాల కారణంగానే సీఎస్ శాంతికుమారి అమెరికా టూర్ కు వెళ్లిన సందర్భంలోనూ ఎవరికీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించలేదని అంటున్నారు.

ప్రభుత్వ పాలనలో IASలే కీలకం. వాళ్లు సాఫీగా పనిచేస్తేనే ఫైళ్లు వేగంగా కదులుతాయి. సర్కార్ లక్ష్యాలు నెరవేరుతాయి. కానీ తెలంగాణ సర్కార్లో కీలక కీలక స్థానాల్లో పనిచేస్తున్న IAS అధికారులకు, సర్కార్కు మధ్య గ్యాప్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇందుకు చాలా కారణాలున్నాయన్న చర్చ జరుగుతోంది. గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరిన కొత్తలో IAS అధికారులపై కొందరు మంత్రులు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వానికి సంబంధించిన కీలక విషయాలను బీఆర్ఎస్ పెద్దలకు లీక్ చేస్తున్నారని ఆరోపణలతో హర్ట్ అయ్యారట పలువురు ఆఫీసర్లు. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలక స్థానాల్లో ఉన్న IASలను ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీ చేశారన్న ప్రచారం ఉంది. సీఎం ఆఫీస్ సహా ప్రధానమైన శాఖల్లో తమకు అనుకూలంగా అనుకున్న అధికారులను నియమించుకుంది ప్రభుత్వం. ఇది ఏ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరినా చేసే పనే. అయితే పాత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొందరు ఐఎఎస్ ల పట్ల కాంగ్రెస్ పెద్దలు అనుమానపు చూపులు చూడ్డమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది
ఇక తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి, కొంత మంది IAS అధికారులకు పొసగడం లేదన్న చర్చ జరుగుతోంది. కొన్ని రోజులుగా సీఎస్కు కొందరు IASల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని సెక్రటేరియట్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎస్ శాంతికుమారి తీరును చర్చించేందుకు ఓ సీనియర్ IAS అధికారి, మరికొందరు IASలతో వారం రోజుల క్రితం సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారట.
తమ శాఖల నిర్వహణలో సీఎస్ జోక్యం చేసుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారని ఈ సమావేశంలో ఒకరిద్దరు ఐఎఎస్ లు వాపోయారని సమాచారం. కొందరు IASలు తమకు అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వహించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకోవడం వెనుక కూడా సీఎస్ ఫీడ్ బ్యాక్ ఉందని అధికారులు భావిస్తున్నారట. ఇలా సీఎస్కు వ్యతిరేకంగా IAS అధికారులు సమావేశం కావడంపై సచివాలయ ఉద్యోగులు, అధికారుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
కీలక సర్క్యులర్
ఈ విభేదాల కారణంగానే సీఎస్ శాంతికుమారి అమెరికా టూర్ కు వెళ్లిన సందర్భంలోనూ ఎవరికీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించలేదని అంటున్నారు. ఇక కొత్తగా పెట్టిన కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా IASల ఆందోళనకు కారణమవుతోందట. స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, డిపార్ట్మెంట్ ఉద్యోగులను ఉద్దేశించి సీఎస్ శాంతి కుమారి ఈ మధ్య కీలక సర్క్యులర్ జారీ చేశారు.
ఇందులో IAS అధికారుల విదేశీ టూర్లను బ్యాన్ చేయడంతో పాటు… స్టడీ టూర్స్, సెమినార్స్, వర్క్షాప్లను కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ ఆఫీసులు, అధికారిక నివాసాల ఖర్చులు తగ్గించాలని ఆదేశించారు. IASలు, ఉన్నతాధికారులు వాడుతున్న అధికారిక వాహనాల ఖర్చులను తగ్గించడమే కాకుండా, కొత్త వాహనాలను కొనుగోలు చేయకూడదని సర్క్యులర్లో మెన్షన్ చేశారు. అయితే ఇదంతా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి మాత్రమేనని ప్రభుత్వం చెప్తుంటే..తమపై కావాలనే ఇలాంటి ఆంక్షలు విధిస్తున్నారని భావిస్తున్నారట IAS అధికారులు
ఇదే సమయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలతో పాటు హెచ్చరికలు వస్తుండటంపై కూడా IAS అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. సీఎం, మంత్రులను విమర్శించే క్రమంలో అపోజిషన్ పార్టీలు తమను టార్గెట్ చేస్తున్నాయని, పొలిటికల్ వార్లో తాము కార్నర్ అవుతున్నామని ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి విషయాల్లో తమకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కొంత మంది IASలు అంతర్గత సమావేశాల్లో వాపోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ కోల్డ్ వార్ కు ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి మరి.
Nara Lokesh: ఎమ్మెల్యేగా, మంత్రిగా లోకేశ్ తనదైన ముద్ర.. ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు తేవడంలో కీరోల్