Nara Lokesh: ఎమ్మెల్యేగా, మంత్రిగా లోకేశ్ తనదైన ముద్ర.. ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు తేవడంలో కీరోల్
అటు మంగళగిరి ఎమ్మెల్యేగా..ఇటు తన మంత్రిగా తన శాఖలను చక్కనపెడుతూ సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు లోకేశ్.

Nara Lokesh
ఎమ్మెల్యేగా మంగళగిరిలో మకాం పెట్టారు. మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నారు. హడావుడి లేదు. మీడియాలో ఎక్స్‌పోజర్ కోరుకోవడం లేదు. ప్రెస్‌మీట్లు పెట్టి అటెన్షన్ గ్రాప్ చేయాలనుకోవట్లేదు. ఓవైపు మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటూనే నవ్యాంధ్రకు పరిశ్రమలు తేవడం మీద ఫోకస్ పెట్టారు మంత్రి నారా లోకేశ్. మొన్నటి ఎన్నికల్లో పార్టీ విజయంలో కీరోల్ ప్లే చేసిన లోకేశ్..తన కనుసన్నుల్లోనే వ్యవహారాలను నడిపిస్తారని అనుకున్నారు.
కానీ తన నియోజకవర్గం..తన మంత్రిత్వ శాఖ తప్ప ఎవరి జోళికి వెళ్లడం లేదు. మిగతా మంత్రుల శాఖల్లో ఇన్వాల్వ్ కూడా కావడం లేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ..పనులు చక్కబెడుతూ..మిగతా క్యాబినెట్ సహచరులకు ఆదర్శంగా నిలుస్తున్నారట. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చాలా సఖ్యతతో ఉంటున్నారు. సేనానితో గ్యాప్ రాకుండా చాలా కేర్ తీసుకుంటున్నారు. పవన్ సూచించినట్లు మధ్యాహ్న భోజన క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ పేరు పెట్టారు.
మంగళగిరిలో సాదాసీదాగా ప్రజల్లోనే ఉంటున్నారు లోకేశ్. ప్రజల అవసరం చిన్నాదా, పెద్దాదా అని లెక్క కాదు..ఆపద వచ్చిన వారికి అండగా ఉంటున్నారు. ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలు తన గడప తొక్కేట్లుగా ప్రజా దర్బార్‌తో పబ్లిక్‌తో టచ్‌లో ఉంటూ వస్తున్నారు. జాబ్‌మేళా నిర్వహించి ఉద్యోగ కల్పనతో పాటు ఫ్రీ వాటర్, అందిస్తూ అడిగిందే ఆలస్యమన్నట్లుగా మంగళగిరి ప్రజలకు ఏది కావాలంటే అది చేసి పెడుతున్నారు.
పీఏలు, తన అనుచరులతో పనులు చక్కబెట్టడం కాకుండా తానే డైరెక్టుగా పబ్లిక్‌తో మాట్లాడుతూ సమస్యలు సాల్వ్ చేస్తున్నారు. దీంతో మంగళగిరి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకునే ప్లాన్ చేస్తున్నారు లోకేశ్. చరిత్రలో రెండంటే రెండుసార్లు మంగళగిరిలో టీడీపీ గెలిచింది. 2019లో లోకేశ్ పోటీ చేసి ఓడిపోయినప్పుడు చాలా విమర్శల పాలయ్యారు. ఛాలెంజ్‌గా తీసుకుని మరీ పట్టుదలతో మళ్లీ అదే మంగళగిరి నుంచి పోటీ చేసి 2024 ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు లోకేశ్. గెలిచాం..ఈ ఐదేళ్లు ఢోకా లేదని కాకుండా..లోకేశ్ పనితీరులో లాంగ్ టర్మ్ వ్యూహం కనిపిస్తోంది. నిత్యం అందుబాటులో ఉంటూ పబ్లిక్‌తో అటాచ్‌మెంట్ పెంచుకుంటూ జననేతగా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
శాఖా పరంగానూ చాలా దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు లోకేశ్. ఎక్కడా హడావుడి లేదు. మీడియా ప్రచారం కూడా కోరుకోవడం లేదు. డ్రగ్స్ కట్టడి కోసం పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఈగల్ అని సెపరేట్ వింగ్ ఏర్పాటు చేయించారు. MSME పాలసీ తీసుకురావడంలోనూ లోకేశ్‌దే కీరోల్. అంతేకాదు విదేశాల్లో ఎవరైనా ఏపీ వాసులు ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చినా ఇమీడియేట్‌గా రియాక్ట్ అవుతున్నారు లోకేశ్.
ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే స్పందన
స్కూళ్లు కాలేజీల్లో ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. ఇలా ఇష్యూ ఏదైనా, సమస్య చిన్నదైనా, పెద్దదైనా క్విక్‌గా రెస్పాండ్ అవుతూ సరిదిద్దే ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు యువగళం పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ఇష్యూస్ విషయంలోనూ ఇప్పుడు తన ముద్ర చూపిస్తున్నారు లోకేశ్. సైలెంట్‌గా రెడ్‌బుక్ అమలు చేస్తూ హడల్ ఎత్తిస్తున్నారు.
దావోస్ టూర్‌లో పలు పెద్ద కంపెనీలతో చర్చలు జరిపి పెట్టబడులు పెట్టేలా చేశారు. వైజాగ్‌కు టీసీఎస్ కంపెనీని తీసుకొచ్చిన లోకేశ్..అందులో 10వేల మందికి ఉపాధి దొరికేలా చేయడంలో సక్సెస్ అవుతున్నారు. అనకాపల్లి జిల్లాలో రూ.1.4 లక్షల కోట్లతో 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అడుగులు పడేలా చేశారు. ఇంకా చాలా కంపెనీలకు భూకేటాయింపుల, ఉపాది కల్పన వంటి అంశాలపై ఫోకస్ పెట్టారు టీడీపీ యువనేత.
అటు మంగళగిరి ఎమ్మెల్యేగా..ఇటు తన మంత్రిగా తన శాఖలను చక్కనపెడుతూ సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు లోకేశ్. ఓ వైపు చంద్రబాబు..మరోవైపు పవన్ కల్యాణ్ ఇద్దరు సీఎం, డిప్యూటీ సీఎం హోదాలో పవర్ సెంటర్స్‌గా ఉన్నారు. లోకేశ్ మాత్రం అన్నీ తానై వ్యవహరిస్తున్నా ఎక్కడా ఎక్స్‌పోజ్ కావడం లేదు. పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఎవరైనా లోకేశ్‌తోనే భేటీ అవుతున్నారు. ప్రభుత్వంలో పవర్ సెంటర్‌గా ఉంటూనే ఆయనపై మంచి ఓపీనియన్ తెచ్చుకుంటున్నారు లోకేశ్. ఒకప్పుడు లోకేశ్ అంటే అవహేళనగా మాట్లాడినవారు కూడా ఇప్పుడు ఆయన పాజిటివ్ ఎనర్జీ అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. అలా తనను తాను అప్డేట్ చేసుకుని..అటు ప్రజలతో ఇటు ప్రభుత్వ పరంగా అన్నివర్గాలతో అటాచ్‌మెంట్ పెంచుకుంటున్నారు లోకేశ్.