Revanth Reddy: లండన్‌ పర్యటనలో సీఎం రేవంత్‌ రెడ్డికి యువతి ఫ్లయింగ్‌ కిస్‌

వేదికపై రేవంత్ రెడ్డి మాట్లాడాక ఓ యువతి ఆయనకు బోకేను అందించింది. దాన్ని రేవంత్ రెడ్డి తీసుకోవడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయిపోయింది.

Revanth Reddy

దావోస్‌ పర్యటన ముగించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్‌లో పర్యటిస్తున్నారు. నిన్న ‘థేమ్స్‌’ నది పాలకమండలితో పాటు పోర్ట్‌ ఆఫ్‌ లండన్‌ అథారిటీ ఉన్నతాధికారులతో చర్చించారు. లండన్ పర్యటనలో రేవంత్ రెడ్డిని చూసిన ఆనందంలో ఓ యువతి అంబరాన్నంటే ఆనందాన్ని వ్యక్తం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

వేదికపై రేవంత్ రెడ్డి మాట్లాడాక ఓ యువతి ఆయనకు బోకేను అందించింది. దాన్ని రేవంత్ రెడ్డి తీసుకోవడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయిపోయింది. గంతులు వేస్తూ రేవంత్ రెడ్డికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇచ్చింది.

రేవంత్ రెడ్డి కూడా ఆ సమయంలో నవ్వుతూ కనపడ్డారు. రేవంత్ రెడ్డికి విదేశాల్లోనూ ఇంతగా ఫాలోయింగ్ ఉందంటూ ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు. కాగా, దావోస్‌ పర్యటనలో రేవంత్ రెడ్డి రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం కొత్త రికార్డు నెలకొల్పింది.

దావోస్‌లో గత ఏడాది తెలంగాణ సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇప్పుడు సాధించిన పెట్టుబడులు రెండింతలు. దావోస్‌లోనూ రేవంత్‌రెడ్డి పలు వేదికలపై మాట్లాడారు. ఇప్పుడు లండన్‌లో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు తెలంగాణకు చెందిన పలువురు అధికారులు ఉన్నారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరానికి సెలబ్రిటీలు ఎంతెంత ఇచ్చారో తెలుసా?