కోట్లాది రూపాయలు విలువజేసే గోల్కొండ వజ్రాలు విదేశాలకు ఎలా వెళ్లాయి? శతాబ్దాల క్రితం నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది?
చాలా సంవత్సరాల తరువాత.. 1292లో మార్కో పోలో అనే యాత్రికుడు భారత్‌ను సందర్శించి ఇక్కడి వజ్రాలు ఎంత అందంగా ఉన్నాయో తెలుసుకుని తన పుస్తకంలో రాశారు.

అరుదైన గోల్కొండ రాయల్ డైమండ్‌ను మే 14న జెనీవాలో వేలం వేయనున్న విషయం తెలిసిందే. ఈ బ్లూ డైమండ్ ఉంగరం న్యూయార్క్‌లోని క్రిస్టీస్ జ్యుయెలరీ షాప్ ఆధ్వర్యంలో ఈ వేలానికి ఉంటుంది. వేలంలో ఈ వజ్రం రూ.300 కోట్లు – రూ.430 కోట్ల మధ్య అమ్ముడుపోవచ్చని అంచనా. దీంతో గోల్కొండ డైమండ్స్‌పై మరోసారి అందరి దృష్టి మళ్లింది.
ఈ గోల్కొండ డైమండ్స్‌కి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ అరుదైన వజ్రాల గురించి ప్రపంచానికి ఎలా తెలిసిందో తెలుసా? ఫ్రెంచ్‌కు చెందిన ప్రసిద్ధ అన్వేషకుడు, వ్యాపారి జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ మొట్టమొదట 1638లో భారతదేశానికి వచ్చారు. ఇక్కడ చాలా అందమైన సహజంగా ఉన్న వజ్రాలను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. మన వజ్రాల గురించి ఆయన తన జర్నల్‌లో చాలా గొప్పగా రాశారు. భారత్‌లో అత్యంత స్వచ్ఛమైన వజ్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.
టావెర్నియర్ భారత్‌కు మొత్తం ఆరు సార్లు వచ్చారు. భారత్ నుంచి తిరిగి యూరప్‌కు వెళ్లిన ప్రతిసారి ఇక్కడి నుంచి పలు వజ్రాలను తీసుకెళ్లారు. అవి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వజ్రాలు. వాటిలో హోప్ డైమండ్, ది బ్లాక్ ఓర్లోవ్, ఐడల్ ఐ, కోహినూర్, బ్యూ సాన్సీ వంటి వజ్రాలు కూడా ఉన్నాయి.
Also Read: వేలానికి గోల్కొండ రాయల్ డైమండ్.. ఎన్ని వందల కోట్ల రూపాయలు? దాని చరిత్ర ఏంటి?
అతని వద్ద ఉన్న వజ్రాల పట్ల యూరోపియన్, రష్యన్ రాజులు, రాణులు, నోబుల్స్‌ను ఆకర్షితులయ్యారు. వజ్రాలను వారు పవర్, గొప్పతనానికి చిహ్నంగా చూశారు. కొన్ని రకాల వజ్రాలు తమ వద్ద ఉంటే అదృష్టం కలిసి వస్తుందని, తమకు రక్షణ కలుగుతుందని వారి నమ్మకం.
కొన్ని ప్రసిద్ధ వజ్రాలు ఇప్పుడు మ్యూజియంలలో ఉన్నాయి. కొన్ని బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ సేకరణలో భాగంగా ఉన్నాయి. కొన్ని వజ్రాలు మిస్ అయ్యాయి. ఆ వజ్రాలు ఏమి అయ్యాయో, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు.
ప్రపంచ దేశాల్లో ఉన్న గోల్కొండ డైమండ్స్ కథ ఇలా ఇండియా నుంచే ప్రారంభమవుతుంది. ఈ వజ్రాలు గురించి మొట్టమొదట 4వ శతాబ్దంలో సంస్కృతంలో రాశారు. దాన్ని బట్టి భారత ప్రజలకు చాలా శతాబ్దాల క్రితమే ఈ వజ్రాల గురించి, వాటి విలువ గురించి తెలుసని అర్థం చేసుకోవచ్చు.
క్రీస్తు పూర్వం 327లో అలెగ్జాండర్ ది గ్రేట్ తన సైన్యంతో భారతదేశానికి వచ్చారు. ఇక్కడి నుంచి యూరప్‌కు తిరిగి వెళ్లేటప్పుడు ఆయన కొన్ని వజ్రాలను తీసుకువెళ్లారు.
అనంతరం, చాలా సంవత్సరాల తరువాత.. 1292లో మార్కో పోలో అనే యాత్రికుడు భారత్‌ను సందర్శించి ఇక్కడి వజ్రాలు ఎంత అందంగా ఉన్నాయో తెలుసుకుని తన పుస్తకంలో రాశారు. దీన్ని బట్టి పురాతన కాలంలో కూడా భారతీయ వజ్రాలకు బాగా విలువ ఉండేదని తెలుస్తోంది. ఎన్నో రూపాల్లో విదేశాలకు వెళ్లిన గోల్కొండ వజ్రాలు మళ్లీ వేలం రూపంలో కనపడుతున్నాయి. కోట్లాది రూపాయలకు అమ్ముడుపోతున్నాయి.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: వేలానికి గోల్కొండ రాయల్ డైమండ్.. ఎన్ని వందల కోట్ల రూపాయలు? దాని చరిత్ర ఏంటి?