Gold Price Today: తగ్గిన బంగారం.. పెరిగిన వెండి ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో శనివారం బంగారం ధర తగ్గింది. మరోవైపు వెండి ధర పెరిగింది.

Gold Rate
Gold and Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో పండుగల సీజన్ మొదలైంది. దీంతో ఇటీవల కాలంలో బంగారం కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా శనివారం బంగారం (Gold) ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. తులం బంగారంపై రూ. 200 తగ్గుదల చోటు చేసుకుంది. మరోవైపు వెండి (Silver) ధర పెరిగింది.

Gold
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ. 200 తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 210 తగ్గింది. దీంతో హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రూ. 54,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 59,840 వద్ద కొనసాగుతుంది.

Gold
దేశవ్యాప్తంగా ధరలను పరిశీలిస్తే..
– దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,000 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,940.
– చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,100 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 60,110.
– బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,850 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,840.
– కోల్‌కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,850 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,840.
– ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 54,850కాగా. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,840.

Gold
పెరిగిన వెండి ధరలు..
దేశవ్యాప్తంగా వెండి ధరలు పెరిగాయి. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి నగరాల్లో కిలో వెండి రూ. 79వేలు వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 79వేలు, ముంబయి, ఢిల్లీ, కోల్ కతా వంటి ప్రాంతాల్లో రూ. 75,500, బెంగళూరులో కిలో వెండి రూ. 74,250 వద్ద కొనసాగుతుంది.