Hyderabad Metro : మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రయాణ వేళలు పొడిగింపు
సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి మెట్రో సేవలు ప్రారంభం అవుతాయి.

Hyderabad Metro
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. మెట్రో రైలు సర్వీసులను పొడిగిస్తూ ఎల్ అండ్ టీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11గంటల 45 నిమిషాల వరకు అందుబాటులో ఉంటాయి. అంటే టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి రైలు ఇకపై రాత్రి 11 గంటల 45 నిమిషాలకు బయలుదేరుతుంది.
శనివారం, ఆదివారం చివరి ట్రైన్ 11 గంటలకు బయలుదేరుతుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి మెట్రో సేవలు ప్రారంభం అవుతాయి. శని ఆదివారాలలో ఉదయం 7 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం మెట్రో రైలు సర్వీసులు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా అన్ని టెర్మినల్ స్టేషన్‌ల నుండి చివరి రైలు బయలుదేరే సమయాన్ని రాత్రి 11 గంటల నుండి 11:45 గంటల వరకు (సోమవారం నుండి శుక్రవారం వరకు) పొడిగించడం జరిగింది. ఇది ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది.
“హైదరాబాద్ మెట్రో రైలు కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కంటే ఎక్కువ. ఇది పట్టణ పరివర్తన, సమాజ సుసంపన్నతకు ఉత్ప్రేరకం. మెట్రో ఫెస్ట్, మెట్రో మెడ్లీ, ఆర్ట్ ఫెస్ట్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలను మా రవాణ పర్యావరణ వ్యవస్థలో అనుసంధానించడం ద్వారా ప్రజా రవాణా పాత్రను మేము బలోపేతం చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరుస్తాయి” అని HMRL MD ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ మెట్రో ఆర్ట్ బెస్ట్ మెట్రో ఉగాది వేడుకల కార్యక్రమాన్ని ఎర్రమంజిల్ ప్రిమియా మాల్ లో నిర్వహించింది ఎల్ అండ్ టి సంస్థ. ఉగాది పండుగను పురస్కరించుకొని పలు సంస్కృతిక కార్యక్రమాలను ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. మెట్రోకు పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా ప్రయాణ సౌకర్యాలు అందించే విధంగా చివరి ట్రైన్ ప్రస్తుతం 11 గంటలకు బయలుదేరుతుంది.
ఇప్పుడు దానిని 11:45 నిమిషాల వరకు పొడిగించారు.
ఆదివారం.. శనివారం రోజులలో ఉదయం ఏడు గంటలకు మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. ఇక సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుండి యధావిధిగా మెట్రో సేవలు ఉండనున్నాయి.
విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణం చేసేలా పొందే ఆఫర్ ను మరొక ఏడాది పాటు కొనసాగించే విధంగా ప్లాన్ చేశామని ప్రకటించింది ఎల్ అండ్ టి. ఏప్రిల్ 2024లో ప్రారంభమైన సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ కార్యక్రమాన్ని ఒక మార్చ్ 31 తో ముగిస్తున్నట్లు తెలిపింది ఎల్ అండ్ టి. హైదరాబాద్ మెట్రో సేవలను పబ్లిక్ కు మరింత దగ్గర చేయడం లక్ష్యంగా ఎల్ అండ్ టి ప నిచేస్తుందని తెలిపారు ఎల్ అండ్ టి అధికారులు.