Hyderabad : న్యూఇయర్ వేళ మందు బాబులకు భారీ శుభవార్త.. ఫ్రీ రైడ్ సేవలు.. ఈ నంబర్‌కు కాల్ చేయండి

Hyderabad : న్యూఇయర్ వేళ మందు బాబుల కోసం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్(టీజీపీడబ్ల్యూయూ) ఉచిత రైడ్ సేవలు ఇవ్వనున్నట్లు తెలిపింది. మద్యం తాగి వాహనం నడపలేని స్థితిలో ఉన్నవారికి ఈ సర్వీస్ అందిస్తామని తెలిపింది

Hyderabad : న్యూఇయర్ వేళ మందు బాబులకు భారీ శుభవార్త.. ఫ్రీ రైడ్ సేవలు.. ఈ నంబర్‌కు కాల్ చేయండి

New Year Celebration

Updated On : December 31, 2025 / 10:14 AM IST
  • న్యూఇయర్ వేళ మందుబాబులకు గుడ్‌న్యూస్
  • మందు బాబులకు ఉచిత రైడ్ సేవలు అందిస్తున్న టీజీపీడబ్ల్యూయూ
  • నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో సదుపాయం

Hyderabad : 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో న్యూఇయర్ వేడుకల సంబరాలు అంబరాన్నితాకనున్నాయి. ఇప్పటికే రిసార్ట్స్, పబ్బులు, పలు ప్రాంతాల్లో న్యూఇయర్ వేడుకలకోసం ఏర్పాట్లు చేశారు.

Also Read : Job Notification : నిరుద్యోగులకు పండగే.. కొత్త సంవత్సరంలో 50వేల కొలువులు.. త్వరలో 14వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

ఉచిత రైడ్ సేవలు..
న్యూఇయర్ వేడుకలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది మద్యం. 31వ తేదీ రాత్రి యువత, పెద్దలు ఎక్కువ శాతం మంది మద్యం మత్తులో న్యూఇయర్ సంబురాల్లో మునిగిపోతారు. అయితే, మద్యం సేవించి వాహనాలు నడిపినా.. మద్యం సేవంచి రోడ్లపై హల్ చల్ చేసినా కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ఇప్పటికే హెచ్చరికలు సైతం జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో న్యూఇయర్ వేడుకల వేళ మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో మద్యం సేవించి వాహనం నడపలేని స్థితిలో ఉన్న వారికి ఉచిత రైడ్ సేవలను అందిస్తామని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) కీలక ప్రకటన చేసింది.

ఈ ప్రాంతాల్లో ఉచిత రైడ్ సదుపాయం..
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉచిత రైడ్ సేవలు అందుబాటులో ఉంటాయని టీజీపీడబ్ల్యూయూ యూనియన్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ సలావుద్దీన్ తెలిపారు. ఈ సేవలు బుధవారం రాత్రి 11గంటల నుంచి జనవరి 1వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ఇలా సంప్రందించండి..
ప్రతీ సంవత్సరం న్యూఇయర్ వేడుకల సమయంలో ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలతో ఉచిత సేవలు అందిస్తున్న యూనియన్.. ఈసారి బిజ్లీరైడ్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. క్యాబ్స్, ఆటోలు, ఈవీ బైక్ లతో కలిపి మొత్తం 500 వాహనాలను ఈ కార్యక్రమంలో వినియోగించనున్నారు. మద్యం సేవించి స్వయంగా బడి నడపలేని వారు 89770 09804 నవంబర్ కు కాల్ చేసి ఉచిత రైడ్ సేవలు పొందొచ్చునని సలావుద్దీన్ సూచించారు.