CM Ramesh: చంద్రబాబుకు కుప్పం, జగన్‌కు పులివెందుల తరహాలో.. ఎంపీ సీఎం రమేష్ బిగ్ పొలిటికల్ స్కెచ్..!

ఇక్కడైతే తనకు ఎలక్షన్ చేయడం చాలా ఈజీ అని సీఎం రమేశ్ భావిస్తున్నారట. తాను అందుబాటులో లేకపోతే, తన సోదరుడు లేకపోతే కుమారుడు నియోజకవర్గ వ్యవహారాలు చూసుకుంటున్నారట.

CM Ramesh: చంద్రబాబుకు కుప్పం, జగన్‌కు పులివెందుల తరహాలో.. ఎంపీ సీఎం రమేష్ బిగ్ పొలిటికల్ స్కెచ్..!

Cm Ramesh (Image Source Via Facebook)

Updated On : December 30, 2025 / 10:34 PM IST
  • రాజకీయ భవిష్యత్తుపై ఫోకస్..
  • అనకాపల్లిని తన పర్మినెంట్‌ సీటుగా చేసుకునే ప్లాన్
  • బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో సేఫ్ జోన్‌

 

CM Ramesh: సీఎం రమేష్. తెలుగు స్టేట్స్‌లో పాపులర్ లీడర్. గతంలో టీడీపీలో ఉన్నా..ఇప్పుడు బీజేపీలో ఉన్నా..ఆయన స్టైలే వేరు. లాబీయింగ్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్న పేరుంది. కడప జిల్లాకు చెందిన సీఎం రమేశ్ ప్రస్తుతం బీజేపీ తరుఫున అనకాపల్లి ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల వరకు సీఎం రమేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది లేదు. రాజ్యసభకు నామినేట్ అవుతూ పెద్దల సభకు వెళ్లే వారు. గత ఎన్నికల్లో అదును చూసి మరి..కూటమి ఊపులో నామినేట్ పదవులకు స్వస్తి చెప్పి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కడప జిల్లా నుంచి వచ్చి అనకాపల్లిలో ఎంపీ ఏంటీ.. అంటూ మొదట కొందరు విమర్శలు చేసినా, సీఎం రమేశ్‌కు వచ్చిన మెజార్టీ చూశాక అప్పట్లో అందరూ షాక్ అయ్యారట.

ఫస్ట్‌ టైమ్‌ డైరెక్ట్ ఎలక్షన్స్‌లో ఎంపీగా పోటీ గెలిచిన..సీఎం రమేశ్ తన పొలిటికల్ ఫ్యూచర్‌పై డెప్త్‌గా ఫోకస్ పెట్టారట. ప్రజలతో నిత్యం టచ్‌లో లేకపోతే లాంగ్ టర్మ్‌ పాలిటిక్స్‌ చేయడం కష్టమని భావించి అనకాపల్లి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారట. అనకాపల్లిని తన పర్మినెంట్‌ సీటుగా చేసుకునే ప్లాన్ చేస్తున్నారట. ఇకపై తన రాజకీయ క్షేత్రం అనకాపల్లే అంటూ అనుచరులకు సంకేతాలు ఇస్తున్నారట సీఎం రమేష్.

చంద్రబాబుకు కుప్పం, జగన్‌కు పులివెందుల తరహాలో..

చంద్రబాబుకు కుప్పం, జగన్‌కు పులివెందుల తరహాలో సీఎం రమేశ్ అంటే అనకాపల్లి అనేలా గ్రౌండ్ వర్క్‌ చేసుకుంటూ పోతున్నారట. తనకంటూ ఓ పర్మినెంట్‌గా ఓ సీటు లేకపోతే ఎన్నికలు వచ్చిన ప్రతీసారి నియోజకవర్గాన్ని వెతుక్కోవడం, అక్కడ అంతా సెట్ చేసుకోవడం కష్టమైన పని అని భావిస్తున్నారట. అందుకే అనకాపల్లి ప్రజల మనసును గెలచుకునేలా పనిచేసి..తన సీటును పదిలం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.

సీఎం రమేశ్ అనకాపల్లిపై ఫోకస్ పెట్టడానికి రాజకీయ, సామాజిక, ఆర్థిక కారణాలు చాలానే ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. అనకాపల్లిలో బీసీ ఓటర్లు అత్యధికం. బీసీలు ఎవరి పక్షనా ఉంటే వారికే పట్టం. సీఎం రమేశ్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా అధికంగానే ఉన్నాయి. టీడీపీకి అనకాపల్లి కంచుకోట. ఇక్కడైతే తనకు ఎలక్షన్ చేయడం చాలా ఈజీ అని సీఎం రమేశ్ భావిస్తున్నారట. అందుకే అనకాపల్లిని తన సొంత, శాశ్వత నియోజకవర్గంగా చేసుకునే ఎత్తుగడ వేస్తున్నారట.

MP Cm Ramesh

MP Cm Ramesh (Image Source Via Facebook)

నిత్యం ప్రజలకు టచ్ లో..

క్యాంప్ ఆఫీస్‌ పెట్టి నిత్యం ప్రజలకు తన తరుఫున..అధికారులు, అనుచరులు అందుబాటులో ఉండేలా చూస్తున్నారట. తరుచూ నియోజవకర్గంలో పర్యటిస్తూ..శుభకార్యాలు, పరామర్శలు ఉంటే నేరుగా సీఎం రమేశే హాజరవుతున్నారట. ఆయన అందుబాటులో లేకపోతే, తన సోదరుడు లేకపోతే కుమారుడు నియోజకవర్గ వ్యవహారాలు చూసుకుంటున్నారట.

అయితే అనకాపల్లి జిల్లాలో అర్సలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్కు, డేటా సెంటర్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా ప్రాజెక్టులు రానున్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ అనుమతులుతో రావాల్సినవే. ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు చేస్తున్న కృషిని కూడా సీఎం రమేశ్ గట్టిగానే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి అంటే సీఎం రమేష్‌ అని గుర్తుకొచ్చేలా ఎత్తులు వేస్తున్నారనే టాక్ ఇటీవల ఊపందుకుంది.

అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎన్నికలప్పుడు లోకల్, నాన్ లోకల్ స్లోగన్ బలంగా వినిపిస్తుంటుంది. ప్రత్యర్థులు, సొంత పార్టీలో ఉండే ఆశవాహులు వాడే లోకల్, నాన్ లోకల్ వెపన్‌ను సీఎం రమేష్‌ ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.

Also Read: మళ్లీ అరెస్ట్ తప్పదా? వల్లభనేని వంశీని వెంటాడుతున్న మరో కేసు..!