KCR: అసెంబ్లీకి కేసీఆర్..? రేవంత్ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టేలా గులాబీ బాస్ ప్లాన్..
అసెంబ్లీకి హాజరుపై ముఖ్యనేతల సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
KCR Cm Revanth (Image Source Via Facebook)
- సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించిన మాజీ సీఎం?
- జనవరి 2 నుంచి జరిగే అసెంబ్లీ సెషన్‌కు కేసీఆర్..!?
- కృష్ణా, గోదావరి జలాలపై చర్చలో పాల్గొననున్న గులాబీ బాస్?
KCR: 14 ఏళ్ల పోరాటం. పదేళ్ల అధికారం. రెండేళ్ల ప్రతిపక్ష పాత్ర. ఒకే ఒక్కడు. ఆయనే కేసీఆర్. నాడు ఉద్యమ నాయకుడిగా అయినా..తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా..ఆయన ఫాంహౌస్‌లో ఉన్నా వార్తే. తెలంగాణ భవన్‌కు వచ్చినా హాట్ టాపికే. అసెంబ్లీకి అటెండ్ అయితే అందరిలో క్యూరియాసిటీ. అలాంటి సీనే మళ్లీ రిపీట్ అయింది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు.
జనవరి 2 నుంచి జరిగే అసెంబ్లీ సెషన్‌కు కేసీఆర్?
కృష్ణా జలాలు, పాలమూరు ఎత్తిపోతలపై కాంగ్రెస్ సర్కార్ తీరును తూర్పార బట్టారు. ఇక పోరు బాటే అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే అసెంబ్లీ స్టార్ట్ అయింది. మొదటి రోజు సమావేశాలకు సార్ అటెండ్ అయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ దగ్గరికి వెళ్లి మరీ సీఎం రేవంత్ పలకరించారు. ఆ తర్వాత సభలో 5 నిమిషాలు ఉండి వెళ్లిపోయారు మాజీ సీఎం. దీంతో కేసీఆర్ సభకు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకు జనవరి 2 నుంచి జరిగే అసెంబ్లీ సెషన్‌కు కేసీఆర్ వస్తారా రారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో నందినగర్‌లోని తన నివాసంలో ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తూ..శాసనసభా వేదికగా సర్కార్‌ను ఇరకాటంలో పెట్టే ప్లాన్ చేస్తున్నారట గులాబీ దళపతి.
అటు సర్కార్ కూడా జనవరి రెండు నుంచి జరిగే అసెంబ్లీ సెషన్‌లో కృష్ణా గోదావరి జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై చర్చకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎజెండాను కూడా ఫిక్స్ చేసింది. జనవరి 2న కృష్ణా, 3న గోదావరి బేసిన్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు తమకు కూడా అవకాశం ఇవాలని ప్రతిపక్షం బీఆర్ఎస్ కోరుతోంది. కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగనున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ సభకు వస్తారా రారా అన్నదే ఆసక్తికరంగా మారింది.
ఏ అంశంపై అయినా చర్చకు రెడీ..
అయితే జనవరి రెండు నుంచి జరిగే అసెంబ్లీ సెషన్‌కు అటెండ్ కావాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కృష్ణా-గోదావరి జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై చర్చలో పాల్గొని నిజానిజాలు చెప్పాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు టాక్. అసెంబ్లీకి హాజరుపై ముఖ్యనేతల సమావేశంలో గులాబీ బాస్ ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఏ అంశంపై అయినా చర్చకు మనం రెడీగా ఉన్నామ్. ప్రిపేర్ అయి రావాల్సింది అధికార పక్షం. మనది డైరెక్ట్ అటాకే. నీటి లెక్కలన్నీ నాలుక మీదే ఉన్నాయని కేసీఆర్ అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో సార్ సభకు వస్తారన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.

KCR Revanth Reddy Representative Image (Image Credit To Original Source)
దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని సవాల్..
కృష్ణా జలాలు, పాలమూరు ఎత్తిపోతలపై మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన కామెంట్స్‌కు..సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని..దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని ఛాలెంజ్ చేశారు. దీంతో తాను సభకు హాజరు కాకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే స్వయంగా తాను సభకు హాజరై..కృష్ణాజలాలు, పాలమూరు ఎత్తిపోతలపై చర్చలో పాల్గొని కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టాలని డిసైడ్ అయ్యారట గులాబీ బాస్.
ఇరిగేషన్ విషయంలో సీఎంతో సహా మంత్రులెవరికీ సరైన అవగాహన లేదనేది కేసీఆర్ అంచనా అంటున్నారు. అందుకే వాళ్లు మాట్లాడాలంటే ప్రిపేర్ అయి రావాలి. మనది డైరెక్ట్ అటాకే అని కారు పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశారట. మొత్తం అసెంబ్లీ సెషన్‌కు కాకపోయినా..నదీ జలాలు, పాలమూరు ఎత్తిపోతలపై చర్చకు మాత్రం తాను తప్పకుండా అటెండ్ కావాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే.. విమర్శలు, ప్రతి విమర్శలు..వాగ్వాదాలు..సభ ఎంత ఇంట్రెస్టింగ్‌గా కొనసాగుతుందో చూడాలి.
Also Read: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి సర్కార్ బిగ్ గుడ్‌న్యూస్..!
