Rythu Bharosa: రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్స్‌లో రైతు భరోసా రూ. 6వేలు పడే డేట్ ఫిక్స్.. ఈ నెల‌లోనే

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు ఎకరాలు ఆపైన భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమచేసేందుకు..

Rythu bharosa

Rythu Bharosa: రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా ‘రైతు భరోసా’ పేరుతో ఖరీఫ్,. రబీ సీజన్ లకు కలిపి ఎకరాకు రూ.12వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, రబీ సీజన్ కు గాను ఇప్పటి వరకు మూడున్నర ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందింది. దీంతో నాలుగు ఎకరాలు ఆపైన భూమి ఉన్న రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో మిగిలిన రైతుల ఖాతాల్లోనూ రైతు భరోసా నగదు జమ కానుంది. రైతు భరోసా నిధుల కోసం ఆర్థిక శాఖ నిధులను సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమైంది.

Also Read: Rain Alert: బిగ్ రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ సహా 12 జిల్లాల్లో వర్షాలు.. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి.. వాతావరణ శాఖ కీలక సూచనలు

రాష్ట్రంలో సాగుకు యోగ్యంగా కాని భూములను మినహాయిస్తే దాదాపు కోటి 50 లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద ప్రభుత్వం సాయం అందించేందుకు సిద్ధమైంది. దీనికోసం సుమారు రూ.9వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం దాదాపు రూ.4వేల కోట్ల వరకు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. నాలుగు ఎకరాలు, ఆపైన భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లోనూ రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది.

Also Read: ‘పాపులారిటీ కోసం ఆర్టీసీ మీద పిచ్చి కామెడీ చేస్తే..’ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు సజ్జనార్ సీరియస్ వార్నింగ్..

ఈనెల 23వ తేదీ తరువాత పెండింగ్ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. మొత్తానికి నాలుగు ఎకరాలు ఆపైన సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో ఈ నెలాఖరు లోగా రైతు భరోసా నిధులు జమ అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు వచ్చే నెల నుంచి ఖరీఫ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో ఖరీఫ్ కు సంబంధించిన రైతు భరోసా నిధులను సైతం జూన్ నెలాఖరు నుంచి దశల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టినట్లు తెలిసింది.