Rain Alert: బిగ్ రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ సహా 12 జిల్లాల్లో వర్షాలు.. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి.. వాతావరణ శాఖ కీలక సూచనలు

ద్రోణి ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో హైదరాబాద్ సహా, పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Rain Alert: బిగ్ రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ సహా 12 జిల్లాల్లో వర్షాలు.. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి.. వాతావరణ శాఖ కీలక సూచనలు

Rains

Updated On : May 16, 2025 / 7:01 AM IST

Rain Alert: ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరియన్, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. తమిళనాడు తీరాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ విభాగం తెలిపింది.

 

ద్రోణి ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో హైదరాబాద్ సహా, పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులు, ఈదురు గాలులు అధికంగా ఉండటంతోపాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మొన్నటి వరకు ఎండవేడిమికి తాళలేకపోయిన ప్రజలు గురువారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు.

 

హైదరాబాద్ లో ఇవాళ కూడా వర్షం పడనుంది. గురువారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారుజామున కూడా వర్షం పడింది. వాతావరణం మేఘావృతమై ఉండటంతోపాటు మరో రెండు రోజులపాటు నగరంలో వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది.

 

మరోవైపు రాష్ట్రంలో ఐదు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు 12 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, 21 జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ అయింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది.