‘పాపులారిటీ కోసం ఆర్టీసీ మీద పిచ్చి కామెడీ చేస్తే..’ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు సజ్జనార్ సీరియస్ వార్నింగ్..

కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి, వారి విధులకు ఆటంకం కలిగిస్తే టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.

‘పాపులారిటీ కోసం ఆర్టీసీ మీద పిచ్చి కామెడీ చేస్తే..’ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు సజ్జనార్ సీరియస్ వార్నింగ్..

VC Sajjanar

Updated On : May 15, 2025 / 2:56 PM IST

VC Sajjanar: కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి, వారి విధులకు ఆటంకం కలిగిస్తే టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా..? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులు గురిచేస్తారా అంటూ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ‘‘ఓ వ్యక్తి బస్సు దగ్గరకు వచ్చి ఈ బస్సు గుంటూరు పోతుందా అని బస్సులో ఉన్న కండక్టర్ ను ప్రశ్నిస్తాడు. మీరు ఎక్కడి పోవాలి అని కడక్టర్ అడగడంతో.. సదరు వ్యక్తి కాలుకు వేసుకున్న చెప్పు తీసి తన చెవికాడ పెట్టుకొని అరేయ్ ఇది గుంటూరు పోదంటరా అంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు’.. ఈ వీడియో వైరల్ కావడంతో సదరు వ్యక్తిపై నెటిజన్లు మండిపడుతున్నారు. కామెడీ పేరుతో ఇలాంటి పిచ్చివీడియోలు తీస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ వీడియోను వీసీ సజ్జనార్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైనా వేస్తారా..? అంటూ మండిపడ్డారు. కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి, వారి విధులకు ఆటంకం కలిగిస్తే టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు అంటూ హెచ్చరించారు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటుందని సజ్జనార్ అన్నారు.