Gossip Garage : కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. మధ్యలో బీఎస్పీ.. ఆ పట్టభద్రుల సీటులో గెలుపెవరిది?

పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్‌ ఎవరికి మేలు చేస్తుంది? ఎవరికి షాక్ ఇస్తుంది? అనేది ఆసక్తిగా మారింది. త్రిముఖ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి..

Gossip Garage : ఆరు నెలలుగా ప్రచారం. ఏడాది క్రితం నుంచి ఓటర్ల నమోదుపై ఫోకస్. ఎట్టకేలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ అయిపోయింది. రిజల్ట్‌ మాత్రమే మిగిలి ఉంది. మరికొన్ని గంటల్లోనే బ్యాలెట్ బాక్సులు ఓపెన్ కానున్నాయి. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే.. పట్టభద్రుల సీటు ఫలితం మాత్రం ఉత్కంఠ రేపుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటుగా.. స్వతంత్ర అభ్యర్థులు గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. సర్వేల అంచనాలు కూడా హీట్ క్రియేట్ చేస్తున్నాయి.

బ్యాలెట్‌ బాక్సులు స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఉన్నాయి. కొన్ని గంటల్లో కౌంటింగ్‌ కు కౌంట్‌ డౌన్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ సీటు రిజల్ట్‌ ఉత్కంఠ రేపుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ తరపున ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌‌‌‌రెడ్డి, బీఎస్పీ తరఫున మాజీ అసిస్టెంట్స్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ, బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీపడ్డారు.

అనూహ్యంగా ప్రధాన ప్రత్యర్థిగా మారిన డాక్టర్..
నామినేషన్లు పూర్తయ్యే నాటికి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే పోటీ ఉంటుందని భావించినప్పటికీ.. బీఎస్పీ నుంచి బరిలో నిలిచిన డాక్టర్ ప్రసన్న హరికృష్ణ అనూహ్యంగా మిగతా ఇద్దరు క్యాండిడేట్లకు ప్రధాన ప్రత్యర్థిగా మారారు. రాష్ట్రంలో బీసీ నినాదం బలపడుతుండటం, చివరి మూడు నాలుగు రోజుల్లో బీఆర్ఎస్ లీడర్లు హరికృష్ణ కోసం పనిచేయడం ఆయనకు ప్లస్‌‌‌‌ అయినట్లు తెలుస్తోంది.

Also Read : తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ ..

ఆ ముగ్గురి మధ్యే ప్రధాన పోరు..
ప్రతిష్ఠాత్మకంగా జరిగిన పోరును అన్ని పార్టీలు సవాల్ గా తీసుకోగా..ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్యే ప్రధానంగా ఎన్నికల పోరు జరిగింది. ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ తో ఢీ అంటే ఢీ అనే రీతిలో బీజేపీ క్యాంపెయిన్ చేసింది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యేలు.. అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ అభ్యర్థి ప్రస్నన్న హరిక్రిష్ణ ఒంటరిగా ఎన్నికల్లో పోరాటం చేయగా.. పోలింగ్‌కు మూడు నాలుగు రోజుల ముందు నుంచి బీఆర్ఎస్ పరోక్షంగా సపోర్టు చేసింది.

ముగ్గురు అభ్యర్థులు గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు. పోలైన ఓట్లలో తమకు వచ్చే ఓట్ల అంచనాలు వేసుకుంటూ ఎవరికి వారే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌పై ఉన్న వ్యతిరేకత, హిందూ ప్రభావం, నిరుద్యోగులు, ఉద్యోగులు అండగా నిలబడుతారని బీజేపీ భావిస్తోంది. కానీ కమలం పార్టీని పోలింగ్ సరళి కలవరపెడుతోందట.

ప్రసన్న హరికృష్ణతో కమలం పార్టీకి తీవ్రమైన నష్టం..!
బీజేపీ విజయానికి ఏనుగు ఎదురెళ్లిందని పోలింగ్ సరళితో తేలిపోయిందట. పోల్ మేనేజ్‌మెంట్‌ చేసినా..ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు బీజేపీ కంటే ప్రసన్న హరికృష్ణ వైపు మొగ్గు చూపారనే అంచనా వేస్తున్నారు. ప్రసన్న హరికృష్ణతో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కమలం పార్టీకి తీవ్రమైన నష్టం జరిగిందన్న చర్చ జరుగుతోంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్, బీఎస్పీ మధ్యే పోటీ అన్నట్లుగా ఓటింగ్ ప్యాటర్న్‌ కనిపించిందట. సర్కారు వ్యతిరేక ఓట్లు భారీగా చీలినప్పటికి..‌ఆ ఓట్లు బీజేపీ కంటే బీఎస్పీకి లాభం చేశాయని అంటున్నారు. కేవలం సర్కార్ వ్యతిరేక ఓటే కాదు.. ‌బీసీ వర్గాల ఓటర్లు కూడా ప్రసన్న హరికృష్ణకు పోలరైజ్‌ అయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని..బీజేపీ కొట్టి పారేస్తుంది.

తన దగ్గర చదువుకున్న వారు, వారి పేరెంట్స్ సపోర్ట్ తో గెలుస్తాననే ధీమా..
ఇక కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కరీంనగర్ వాసి కావడం..గెలుపును ప్రభావితం చేసేలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓట్లు ఉండటంతో..ఆయనకు బానే ఓట్లు పోలై ఉంటాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. అందరి కంటే ముందే..టికెట్‌ కన్ఫామ్‌ కాకపోయినా నరేందర్ రెడ్డి ప్రచారాన్ని మొదలు పెట్టి..లక్షకుపైగా ఓటర్ ఎన్ రోల్ మెంట్ చేయించారు. ఆయన దగ్గర విద్యను అభ్యసించిన వారు, వారి పేరెంట్స్, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు, సామాజిక వర్గం సపోర్ట్‌తో వచ్చిన ఓట్లతో విజయం సాధిస్తాననే ధీమాలో నరేందర్ రెడ్డి ఉన్నారు.

Also Read : రూ.100 కోట్లతో తాపీ మేస్త్రీ పరార్.. చిట్టీల పేరుతో ఘరానా మోసం.. వారం గడుస్తున్నా దొరకని ఆచూకీ

కాంగ్రెస్ పుంజుకోవడానికి సీఎం రేవంత్ పర్యటన గేమ్‌ఛేంజర్‌గా మారిందంటున్నారు హస్తం పార్టీ నేతలు‌‌‌‌. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్‌లో రేవంత్ చేసిన ప్రచారంతో సమీకరణాలు మారిపోయాయంటున్నారు. సర్కారు వ్యతిరేక ఓటు చీలినా‌..పాజిటివ్ ఓటుతో గట్టెక్కుతామని అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు.

పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్‌ తో ఎవరికి మేలు, ఎవరికి షాక్?
ఇక బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులతో పాటు మరో 53 మంది అభ్యర్థులు చీల్చే ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. గతంలో 59శాతం పోలింగ్ అయితే ఈసారి 70.42 శాతం ఓటింగ్ జరిగింది. పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్‌ ఎవరికి మేలు చేస్తుంది? ఎవరికి షాక్ ఇస్తుంది? అనేది ఆసక్తిగా మారింది. త్రిముఖ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి మరి.