రాజీవ్ యువ వికాసం స్కీమ్.. రుణాల పంపిణీకి సర్వం సిద్ధం… మొదట వీరికి ఇస్తారు..
రుణ మంజూరు పత్రాలను అందించనున్నారు.

Rajiv Yuva Vikasam
తెలంగాణలో రాజీవ్ యువ వికాసం స్కీమ్‌లో భాగంగా జూన్ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను అందించనున్నారు. శిక్షణ జూన్ 10 నుంచి 15 వరకు, యూనిట్ల గ్రౌండింగ్ జూన్ 15 నుంచి ప్రారంభం కానుంది.
లబ్ధిదారుల తుది జాబితా బ్యాంకుల నుంచి వచ్చి, ఇన్‌చార్జ్ మంత్రుల ఆమోదంతో కలెక్టర్లకు చేరినట్టు ఎస్సీ వెల్ఫేర్ అధికారులు తెలిపారు. మొదటి దశలో రూ.50,000, రూ. లక్ష వరకు రుణాలకు అర్హత సాధించిన లక్ష మందికి రుణ మంజూరు పత్రాలు అందించనున్నారు.
Also Read: తెలంగాణలో భారీగా పెరిగిన రేషన్ కార్డులు.. మీకూ కొత్త రేషన్ కార్డు వచ్చిందా?
ఈ ఏడాది స్కీమ్ కింద 5 లక్షల మందికి మొత్తం బడ్జెట్ రూ.6,000 కోట్లతో లబ్ధిచేకూరనుంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మే 27న ముగియనుంది. ఈ పథకానికి నాలుగు రకాల రుణాల కేటగిరీలకు మొత్తం 16.22 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల రుణాలకు అత్యధికంగా 12 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
సబ్సిడీ వివరాలు
రూ. 50,000లోపు రుణాలకు: 100% సబ్సిడీ
రూ.లక్షలోపు రుణాలకు: 90% సబ్సిడీ
రూ.1–2 లక్షల రుణాలకు: 80% సబ్సిడీ
రూ.2–4 లక్షల రుణాలకు: 70% సబ్సిడీ