Beer Price : అమ్మకాలు పెంచేందుకు బీరు ధర తగ్గించిన ప్రభుత్వం

బీరు ధరను రూ.10 తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ధర పాత స్టాక్ అయిపోగానే అమలులోకి రానుంది. మద్యం అమ్మకాలు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధరలు తగ్గించినట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడింది.

Beer Price

Beer Price : బీరు ధరను రూ.10 తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధర పాత స్టాక్ అయిపోగానే అమలులోకి రానుంది. మద్యం అమ్మకాలు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధరలు తగ్గించినట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడింది.

ఆదాయం పెంచేందుకు గతేడాది మే నెలలో మద్యం ధరలను భారీగా పెంచింది ప్రభుత్వం.. ధరలు పెంచిన నాటి నుంచి అమ్మకాలు తగ్గాయి దీంతో ఆదాయం పడిపోయింది. ప్రతి నెల 2700 కోట్ల రూపాయలను మద్యంపై ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గాయి. దీంతో ఆదాయం తగ్గింది.

ప్రస్తుతం రూ. 2500 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే బీర్ ధర తగ్గించి అమ్మకాలు పెంచాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అమ్మకాలు పెరిగితే ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి ఆదాయం చేరుతుంది.