Warangal : ప్రేమోన్మాది ఘాతుకం.. MGM సూపరింటెండెంట్‌కు తమిళిసై ఫోన్
వరంగల్ ప్రేమోన్మాది ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై విచారం వ్యక్తం చేశారు. అతడి దాడిలో గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. MGM...

Warangal Governor
Governor Tamilisai Phone To MGM Superintendent : వరంగల్ ప్రేమోన్మాది ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై విచారం వ్యక్తం చేశారు. అతడి దాడిలో గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. MGM సూపరింటెండెంట్ తో గవర్నర్ తమిళిసై మాట్లాడారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఇటీవల ప్రభుత్వంతో అటు ఇటుగా ఉన్న తెలంగాణ గవర్నర్ ఇక దూకుడు పెంచారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ ఆమె ఓ కంట కనిపెడుతున్నారు. ఇటీవల జరిగిన పలు ఘటనలపై ప్రభుత్వాన్ని నివేదిక కోరారు.
Read More : Warangal : యువతి గొంతు కోసిన ఉన్మాది ఎక్కడ ? పోలీసుల గాలింపు
రామాయంపేటలో తల్లీకొడుకుల ఆత్మహత్య.. ఖమ్మంలో సాయిగణేష్ ఆత్మహత్య ఘటనలపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరారు. అలాగే భువనగిరి పరువు హత్య, కోదాడలో యువతిపై సామూహిక అత్యాచారం భయంకరమైన నేరాలుగా పేర్కొన్నారు గవర్నర్. ఈ ఘటనలపై వివరణాత్మక నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు గవర్నర్ తమిళి సై. ఇక కాళోజీ యూనివర్సిటీలోని మెడికల్ సీట్ల బ్లాక్ దందాపైనా గవర్నర్ ఫోకస్ పెట్టారు. మెడికల్ సీట్ల స్కామ్‌పై నివేదిక ఇవ్వాలంటూ యూనివర్సిటీ వీసీని ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో.. తమిళి సై తీసుకున్న నిర్ణయాలు మరింత చర్చనీయాంశంగా మారాయి. గవర్నర్ దూకుడుతో.. టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.