Tamilisai : నేను ఏది మాట్లాడిన తెలంగాణ ప్రజల కోసమే.. అమిత్ షాతో ముగిసిన గవర్నర్ తమిళిసై భేటీ
రాజ్ భవన్ కు ఏ పార్టీతోనూ సంబంధం ఉండదని, సీఎం, మంత్రులు, సీఎస్ ఎప్పుడైనా రావొచ్చని, నేను ఏది మాట్లాడిన తెలంగాణ ప్రజల కోసమేనని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

Tamilisai Soundararajan
Tamilisai : రాజ్ భవన్ కు ఏ పార్టీతోనూ సంబంధం ఉండదని, సీఎం, మంత్రులు, సీఎస్ ఎప్పుడైనా రావొచ్చని, నేను ఏది మాట్లాడిన తెలంగాణ ప్రజల కోసమేనని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో తమిళిసై భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, పుదుచ్చేరిలోని అనేక అంశాలపై అమిత్ షాతో భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిపారు. అమిత్ షాతో చర్చించిన విషయాలు బయటకు చెప్పనన్నారు. తన విషయంలో తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసునని తమిళిసై అన్నారు.
Tamilisai Soundararajan : గవర్నర్ తమిళ్ సై ఢిల్లీ టూర్ వెనుక కారణం ఇదేనా…!
నేను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని, అందరితో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తిని అని తెలిపారు. రాజభవ్ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, రాజ్ భవన్ కు ఏ పార్టీతోనూ సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఉగాది వేడుకలకు ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించానని తెలిపిన తమిళిసై .. రాజ్ భవన్, గవర్నర్ ను కావాలనే అవమానిస్తున్నారని అన్నారు. తమిళిసైని కాకపోయిన.. రాజ్ భవన్ ను గౌరవించాలని అన్నారు. నేను ఎవరిని విమర్శించడం లేదని పేర్కొన్నారు.
భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరుతానని, రోడ్డు లేదా రైలు మార్గంలో అక్కడికి వెళ్తానని తెలిపారు. మేడారం జాతరకు కూడా ఐదు గంటల పాటు రోడ్డు మార్గంలోనే ప్రయాణించినట్లు గుర్తు చేశారు. యాదాద్రి వెళ్తే బీజేపీ నేతగా వెళ్లానని ఎలా చెప్పగలరు అంటూ గవర్నర్ ప్రశ్నించారు. ఎవరి సహకారం ఉన్నా.. లేకున్నా నేను పాజిటివ్ గా ముందుకెళ్తానని తెలిపారు. ఎవరూ నా ప్రయాణాలను ఆపలేరని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్ భవన్, గవర్నర్ విషయంలో జరిగేది మాత్రమే చెబుతున్నానని, ఒక మహిళను గౌరవించే విధానం ఇది కాదన్నారు. సోదరిగా భావిస్తే ఇలా అవమానిస్తారా అంటూ తమిళిసై ప్రశ్నించారు.