పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో తీన్మార్ మల్లన్న ముందంజ.. రెండో స్థానంలో ఎవరో తెలుసా?
Graduates MLC bypoll: ఏకకాలంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో పాటు చెల్లని ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

తెలంగాణలోని వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. బుధవారం మధ్యాహ్నం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నాలుగు రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 7,670 ఓట్ల ఆధిక్యం సాధించారు. రెండో రౌండ్ తర్వాత 14,672 ఓట్ల ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న ఉన్నారు. మూడో రౌండ్ తర్వాత 18,878 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
పోలైన ఓట్లు
మూడో రౌండ్ తర్వాత
కాంగ్రెస్.. తీన్మార్ మల్లన్న)- 1,06,234
బీఆర్ఎస్.. రాకేష్ రెడ్డి)-87,356
బీజేపి.. ప్రేమేందర్ రెడ్డి)- 34,516
అశోక్ పాలకూరి (స్వతంత్ర)- 27,493
మూడు రౌండ్ల లో చెల్లిన ఓట్లు)- 2,64,216
రెండో రౌండ్ తర్వాత
కాంగ్రెస్.. తీన్మార్ మల్లన్న)- 70,785
బీఆర్ఎస్.. రాకేశ్ రెడ్డి)- 56,113
బీజేపీ.. ప్రేమేందర్ రెడ్డి)- 24,236
అశోక్ పాలకూరి (స్వతంత్ర))- 20,127
తొలి రౌండ్ తర్వాత
- కాంగ్రెస్.. తీన్మార్ మల్లన్న- 36,210
- బీఆర్ఎస్.. రాకేశ్ రెడ్డి- 28,540
- బీజేపీ.. ప్రేమేందర్ రెడ్డి- 11,395
- అశోక్ పాలకూరి (స్వతంత్ర)- 9,109
- మొదటి రౌండ్ లో చెల్లిన ఓట్లు- 88,369
- చెల్లని ఓట్లు- 7,728
ఏకకాలంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో పాటు చెల్లని ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక గెలుపు మ్యాజిక్ ఫిగర్ ను అధికారులు ప్రకటించనున్నారు. ఇవాళ రాత్రి వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది. ఈ ఎమ్మెల్సీ స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది.
Also Read: ఎన్డీయేలో కీలకంగా మారిన చంద్రబాబు..! ఈసారైనా ఏపీ దశ మారబోతోందా?