తెలంగాణ‌లోని విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. ఈ నెల‌ 15 నుంచి ఒంటిపూట బ‌డులు..

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త రోజు రోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

తెలంగాణ‌లోని విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. ఈ నెల‌ 15 నుంచి ఒంటిపూట బ‌డులు..

Half Day schools in Telangana From March 15th

Half Day schools : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల‌కు శుభ‌వార్త‌. రాష్ట్రంలో ఎండ‌ల తీవ్ర‌త రోజు రోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 15 (శుక్ర‌వారం) నుంచి ఒంటిపూట బ‌డుల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు, ఎయిడెట్ స్కూళ్లల‌లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వ‌రకు ఒంటిపూట బ‌డులు కొన‌సాగ‌నున్నాయి.

ఈ రోజుల్లో పాఠ‌శాల‌లు ఉద‌యం 8 గంట‌ల నుంచే ప్రారంభం కానున్నాయి. మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు పాఠాలు భోదించ‌నున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నం పెట్టిన‌ అనంత‌రం విద్యార్థుల‌కు పంపాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఇక 10వ త‌ర‌గ‌తి ఎగ్జామ్స్ జ‌రిగే పాఠ‌శాల్లో మాత్రం మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌నున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నిర్వ‌హిస్తారు. ఈ మేర‌కు పాఠ‌శాల విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Also Read: మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత