Harish Rao : రజకులకు బడ్జెట్‌లో రూ. 250 కోట్లు, హైదరాబాద్ లో 3 ఎకరాల భూమి – హరీష్ రావు
తెలంగాణలోని రజకుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, వారి సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ. 250 కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Harish Rao
Harish Rao : తెలంగాణలోని రజకుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, వారి సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ. 250 కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన రజక ఆశీర్వాద సభలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. అన్ని కులాల కోసం, ఆ వృత్తులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Read More : Encounter : జమ్మూలో ఉగ్రవేట.. ఇద్దరు హతం
రజకులలో పేదలున్నారని, వారిని దృషిలో ఉంచుకొని 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో రజకులకు కార్పొరేషన్ లోన్లు ఇస్తామన్నారు. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం. కానీ ఎలాంటి స్పందన లేదన్నారు. హైదరాబాద్ నగరంలో రజకులకు 3 ఎకరాల భూమి ఇచ్చి 5 కోట్ల నిధులు ఇచ్చామని తెలిపారు.
Read More : UP Cabinet Expansion : యూపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్!
ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల గురించి మాట్లాడుతూ గెల్లు శ్రీను పేదవాడిని, అతడిని గెలిపించాల్సిన బాధ్యత మీపైనే ఉందని అన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల పేదలకు మేలు చేసే విధంగా పథకాలు తీసుకొస్తుందని అన్నారు. ఈటల హుజూరాబాద్ కు ఏం చేశారో చెప్పాలని, ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని తెలిపారు. అభివృద్ధి చేస్తున్న పార్టీకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.