Huzurabad Election 2021 : బీజేపీని బొంద పెట్టు, కారుకు ఓటు గుద్దు..ఈటలకు ఆత్మగౌరవం ఇచ్చింది టీఆర్ఎస్

ధరలు పెంచే వాళ్లు కావాలా...పేదలకు మేలు చేసే పార్టీ కావాలా ఆలోచించాలని ఓటర్లకు మంత్రి హరీష్ రావు సూచించారు. హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది ఈటల రాజేందర్ అని తెలిపారు.

Huzurabad Harish Rao : హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం ముగియనున్న తరుణంలో పార్టీలు ప్రచారాన్ని మరింత స్పీడ్ పెంచాయి. నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడి రగులుకుంది. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ మరింత విమర్శల దాడిని పెంచేసింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ..ప్రచారంలో దూసుకపోతున్నారు మంత్రి హరీష్ రావు. అక్కడే మకాం వేసి..ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఈటలపై మాటల తూటాలు పేలుస్తున్నారు.

Read More : Kodali Nani : ఏపీలో రేషన్ షాపులు బంద్.. మంత్రి కీలక వ్యాఖ్యలు

2021, అక్టోబర్ 26వ తేదీ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో హరీష్ రావు మాట్లాడుతూ… ఈటల రాజేందర్ కు ఆత్మగౌరవం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీయేనని, ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఆత్మగౌరవం కల్పించింది సీఎం కేసీఆర్ అని తెలిపారు. బీజేపీలో చేరి హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది ఈటల రాజేందర్ అని, పెంచి పెద్దచేస్తే… టీఆర్ఎస్ వీడి ఢిల్లీ పెద్దల ముందు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది ఆయనే అంటూ విమర్శించారు మంత్రి హరీష్ రావు.

Read More : Udaipur Teacher : పాక్ గెలిచిందని సంబరాలు చేసుకున్న టీచర్..ఉద్యోగం కోల్పోయింది

ధరలు పెంచే వాళ్లు కావాలా…పేదలకు మేలు చేసే పార్టీ కావాలా ఆలోచించాలని ఓటర్లకు సూచించారు. దళిత బందు పేద దళితులతో స్టార్ట్ అయిందని, అన్ని కులాల్లోని పేదలకు ఇది అందుతుందన్నారు. తాము కిషన్ రెడ్డిని వేయ్యి రూపాయల ధరను 500 తగ్గించాలని సూచిచండం జరిగిందని, కానీ దానికి సమాధానం ఇవ్వలేదన్నారు. ఏడాదిలో గ్యాస్ ధర 2000 చేస్తారంట అని ఎద్దేవా చేశారు. సిలిండర్ కు దండం పెట్టు, బీజేపీని బొంద పెట్టు, కారుకు ఓటు గుద్దు అనేది నినాదం కావాలన్నారు. బీజేపీ కేంద్ర మంత్రి తరుణ్ ఛుగ్ ఓ మేనిఫెస్టో రిలీజ్ చేశారని, అదోక పెద్ద జోక్ అని అభివర్ణించారు. పెన్షన్ 3 వేలు ఇస్తారని అంటున్నారని, మరి గుజరాత్ రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్ 600 మాత్రమేనని వివరించారు. వారు పాలిస్తున్న రాష్ట్రంలో ఇవ్వలేదు కాని.. ఇక్కడ 3 వేలు ఎలా ఇస్తారంటూ సూటిగా ప్రశ్నించారు హరీష్ రావు.

Read More : Japanese princess : రాచరిక హోదా వదులుకొని..సామాన్యుడిని పెళ్లాడిన జపాన్ యువరాణి

ఓటమి భయంతో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గిల్లికజ్జాలు పెట్టుకుని, వాళ్లపై వాళ్లే రాళ్లు వేసుకుని ఆయ్యో పాపం అని యాక్టింగ్ చేస్తున్నారని బీజేపీ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బండి సంజయ్ కరీంనగర్ ఓట్లప్పుడు ఇలానే పడిపోయి, ఆక్సిజన్ పెట్టించుకుని హాస్పిటల్ లో చేరిండని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. అక్టోబర్ 30వ తేదీన హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి జూన్ 12వ తేదీన రాజీనామా చేయడంతో…ఉప ఎన్నిక అనివార్యమైంది.

ట్రెండింగ్ వార్తలు