GHMC elections : జీహెచ్ఎంసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రేటర్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది. రిజర్వేషన్లు రోటేషన్ పద్ధతి లేకుండా ఎన్నికలు నిర్వహించడం చట్ట విరుద్ధమని పిటిషన్ దాఖలు అయింది.
లంచ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. అయితే లంచ్ మోషన్ కు హైకోర్టు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మున్సిపల్ యాక్ట్ 52Eని చాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను లంచ్ మోషన్ ద్వారా విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు మంగళవారం (నవంబర్ 17,2020) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి విడుదల చేశారు. రేపటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపారు.
ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరించనున్నట్లు చెప్పారు. నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. నవంబర్ 22 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని పేర్కొన్నారు.
https://10tv.in/good-days-for-tsrtc/
డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 3న అవసరమైతే రీపోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 4న కౌంటింగ్ ఉంటుందని తెలిపారు.
గ్రేటర్ లో ఎన్నికల కోడ్ అమలు ఉందని తెలిపారు.
గ్రేటర్ లో రిజర్వేషన్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవి మహిళ (జనరల్), ఎస్టీ-2, ఎస్సీ-10
బీసీ-50, జనరల్ మహిళ-44, జనరల్-44 కేటాయించారు.