తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం.. ఎక్కడెక్కడంటే?

తెలంగాణలోని ఆదిలాబాద్, జనగాం, భూపాలపల్లి, ఖమ్మంతో పాటు..

తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం.. ఎక్కడెక్కడంటే?

Updated On : September 21, 2024 / 2:22 PM IST

బంగాళాఖాతంలో అల్పపీనడం ఏర్పడే అవకాశం ఉందని, రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణలోని అన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో రెండు రోజులపాటు వాతావరణం మేఘావృతమై ఉంటుందని, ఓ మోస్తరు వర్షం కురుస్తుందని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

తెలంగాణలోని ఆదిలాబాద్, జనగాం, భూపాలపల్లి, ఖమ్మంతో పాటు మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, హనుమకొండలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడురోజులు బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని అన్నారు. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రత పెరగిన విషయం తెలిసిందే. శుక్రవారం వర్షాలు కురియడంతో వాతావరణం చల్లబడింది.

Indian temples: భారతదేశంలో పది ప్రముఖ దేవాలయాల్లో అందించే ప్రత్యేకమైన ప్రసాదాలు ఇవే..