హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. వాహనదారుల ఇబ్బందులు

నగరంలోని మరిన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. వాహనదారుల ఇబ్బందులు

Heavy Rains in Hyderabad

Updated On : July 16, 2024 / 4:35 PM IST

Hyderabad Rains: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్‌లో వాన పడుతోంది. నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి, గాజులరామారం, షాపూర్ నగర్, చింతల్, సూరారం, సుచిత్ పరిసర ప్రాంతాలలోనూ కురుస్తోంది.

శేరిలింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌, కుత్బుల్లాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం తగ్గాక వెళ్దామని మెట్రో రైలు పిల్లర్ల కింద కొందరు వాహనదారులు వాహనాలను ఆపుతున్నారు. బస్సులు, వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేవారు మెట్రో రైళ్లలో వెళ్లడానికి మక్కువ చూపుతున్నారు.

Also Read: గుంతను తొవ్విన మహిళలు.. అందులో హారాలు, బంగారు లాకెట్లు, పతకాలు, ఉంగరాలు, చెవిపోగులు.. ఇంకా ఎన్నో..