Weather Forecast: గుడ్‌న్యూస్‌.. వారం రోజుల పాటు వర్షాలే వర్షాలు..

రాష్ట్రంలోని వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో వడగండ్ల వానలు కూడా కురిసే అవకాశం ఉంది.

Weather Forecast: గుడ్‌న్యూస్‌.. వారం రోజుల పాటు వర్షాలే వర్షాలు..

Rains

Updated On : March 31, 2025 / 5:25 PM IST

తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పొడి వాతావరణం ఉంది. ఇవాళ గరిష్ఠ ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు లేదు. మంగళవారం నుంచి వచ్చే 4 రోజుల్లో క్రమంగా 2 నుంచి 4°సెల్సియస్ తగ్గే అవకాశం ఉంది.

మంగళవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 40-50 కి.మీ)తో కూడిన వర్షాలు పడతాయి. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఇక బుధవారం ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గురువారం కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో మోస్తరు వర్షాలతో పాటు వడ గండ్ల వానలు కూడా కురిసే అవకాశం ఉంది. గురువారం నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాతి మూడు రోజులు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.