Helicopter accident: నల్గొండ జిల్లాలో చాపర్ ప్రమాదం
నల్గొండ జిల్లాలోని తుంగతుర్తిలో హెలికాప్టర్ కూలింది. శిక్షణ హెలికాప్టర్ గా గుర్తించారు అధికారులు. ఈ ప్రమాదంలో పైలట్ తో పాటు, ట్రైనీ పైలట్ కూడా మృతి చెందినట్లు సమాచారం.

Helicopter Accident
Helicopter accident: నల్గొండ జిల్లాలోని తుంగతుర్తిలో చాపర్ కూలింది. శిక్షణ చాపర్ గా గుర్తించారు అధికారులు. ఈ ప్రమాదంలో పైలట్ తో పాటు, ట్రైనీ పైలట్ కూడా మృతి చెందినట్లు సమాచారం. ఘటనాప్రదేశంలో దట్టమైన పొగలు విస్తరించడంతో స్థానికులు భయాందోళనలో వణికిపోయారు.
దట్టమైన పొగలు వ్యాపించడంతోనే అక్కడికి వెళ్లామని, కూలిన సమయంలో తాము గమనించలేదని చెబుతున్నారు. ప్రమాదం జరుగుతున్నప్పుడు ఎటువంటి శబ్దం రాకపోవడాన్ని బట్టి చూస్తుంటే ల్యాండ్ అయిన తర్వాతే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు.
ప్రమాదంలో కనిపించిన విడిభాగాలను బట్టి ట్రైనీ చాపర్ గా గుర్తించారు. సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.