Telangana New Secretariat
Telangana New Secretariat : అడుగడుగునా నిఘా కెమెరా కళ్లు. నిత్యం సాయుధ భద్రతా దళాల పర్యవేక్షణ. చీమ చిట్టుక్కుమన్నా ఇట్టే పసిగట్టే కమాండ్ కంట్రోల్ సిస్టమ్. అనుమతి లేనిది లోపలికి అడుగు కూడా పెట్టలేని విధంగా తెలంగాణ సచివాలయం భద్రతా వ్యవస్థ ఏర్పాటవుతోంది. తెలంగాణకే తలమానికంగా నిలవనున్న సెక్రటేరియట్ సెక్యూరిటీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది కేసీఆర్ సర్కార్.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సౌధం. రాజప్రసాదాన్ని తలపిస్తూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, హుస్సేన్ సాగర్ తీరంలో ప్రారంభానికి ముస్తాబవుతోంది. ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేతుల మీదు కొత్త సచివాలయం ప్రారంభం కానుంది.
Also Read..Telangana Politics: కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి
పరిపాలనకు గుండె లాంటి సచివాలయం అందుబాటులోకి వస్తే సీఎం కేసీఆర్, మంత్రులు, సీఎస్, ఐఏఎస్ లు, వివిధ శాఖల ఉన్నతాధికారుల నుంచి అటెండర్ వరకు నిత్యం వేలాది మంది ఇక్కడే ఉంటారు. విజిటర్స్ వస్తుంటారు. దీంతో సెక్రటేరియట్ భద్రత ఎంతో కీలకం. పలు దఫాలుగా ఈ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి సచివాలయం భద్రతకు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read..Achchennaidu : వైసీపీ-బీజేపీ మధ్య సంబంధం ఉందో లేదో ప్రజలకు తెలుసు : అచ్చెన్నాయుడు
సచివాలయానికి ప్రత్యేక భద్రతా వ్యవస్థ..
1300 కెమెరాలు.. 650 మంది పోలీసులు
పార్లమెంటు తరహాలో తెలంగాణ సెక్రటేరియట్ సెక్యూరిటీ సిస్టమ్
అడుగడుగునా కెమెరాలో నిఘా
కమాండ్ కంట్రోల్ సిస్టమ్ తో భద్రత పర్యవేక్షణ
తెలంగాణ స్టేట్ పోలీస్ సిబ్బందితో భద్రత
నిత్యం 650 మంది సాయుధ సిబ్బందితో పహారా
ఇంటిగ్రేటేడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ
బార్ కోడ్ తోనే విజిటర్స్ కు అనుమతి
బ్లాక్ దాటితే బార్ కోడ్ తో బ్రేకులు