Achchennaidu : వైసీపీ-బీజేపీ మధ్య సంబంధం ఉందో లేదో ప్రజలకు తెలుసు : అచ్చెన్నాయుడు

జగన్ పచ్చి అబద్దాలకోరని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీఎంకు చెందిన మరో బాబాయ్ ని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.

Achchennaidu : వైసీపీ-బీజేపీ మధ్య సంబంధం ఉందో లేదో ప్రజలకు తెలుసు : అచ్చెన్నాయుడు

Achchennaidu

Achchennaidu : భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి ట్వీట్ పై అచ్చెన్నాయుడు పరోక్ష కామెంట్లు చేశారు. బీజేపీకి వైసీపీకి మధ్య సంబంధం లేదని ప్రజలు అనుకోవాలని.. అచ్చెన్నాయుడో.. సునీల్ ధియోధరో.. వేరేవరో అనుకుంటే ఫలితం లేదన్నారు. మనం చెప్పే మాటలను ప్రజలు నమ్మాలని పేర్కొన్నారు. వైసీపీ-బీజేపీ మధ్య సంబంధం ఉందో లేదో ప్రజలకే తెలుసన్నారు. నాలుగేళ్ల కాలంలో ఏం చేశారని ప్రశ్నించారు.

ఏప్రిల్ 1వ తేదీన కేంద్రం ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ ఫిక్స్ చేస్తుందని చెప్పారు. జగన్ అదృష్టం.. అప్పులు.. ఎఫ్ఆర్బీఎం వెసులుబాట్ల విషయంలో ఏ రాష్ట్రానికి లేని అవకాశాలు ఏపీకే వస్తున్నాయని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో ఏపీకి ఇవ్వాల్సిన అప్పును మార్చి నెలలోనే వచ్చేలా చేశారని వెల్లడించారు. ఇలాంటివన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. బీజేపీపై పితాని కామెంట్లు వ్యక్తిగతం అన్నారు. ఇతర పార్టీలపై టీడీపీ విధానం పార్టీ పొలిట్ బ్యూరోలో చర్చించాకే నిర్ణయిస్తామని చెప్పారు.

Andha Pradesh : వైసీపీ నాయకులకు టీడీపీ అధికారంలోకి వచ్చాక చక్రవడ్డితో కలిపి ఇచ్చేస్తాం : అచ్చెన్నాయుడు

టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అందరికీ అర్థమైందన్నారు. గతంలో అవమానించిన వారు.. అవహేళన చేసినవారు.. ఇప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబును ఎవరు విమర్శించినా ప్రజలు ఛీ కొడుతున్నారని తెలిపారు. ప్రజల్లో మార్పు చూసి.. గతంలో విమర్శించిన వాళ్లల్లో భయంతో కూడిన మార్పు వచ్చిందన్నారు.

జగన్ పచ్చి అబద్దాలకోరని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీఎంకు చెందిన మరో బాబాయ్ ని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్యపై జరుగుతోన్న చర్చను పక్క దారి పట్టించేందుకే జగన్ కామెంట్లు చేస్తున్నారని వెల్లడించారు. ఉత్తరాంధ్రకు తాము ఏం చేశామో వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం.. వైసీపీ ఏం చేసిందో చెప్పగలరా..? అని సవాల్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు చంద్రబాబే ఎక్కువ ఖర్చు చేశారని ఇరిగేషన్ ఈఎన్సీనే చెప్పారని గుర్తు చేశారు.

Atchannaidu : ఆ నలుగురే కాదు.. 40మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు- అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

భావనపాడు పోర్టుకు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇప్పుడు శంకుస్థాపన చేస్తారా..? అని నిలదీశారు. జగన్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందని ఎద్దేవా చేశారు. వెంటిలేటర్ మీదుండి శంకుస్థాపన చేస్తామంటే ఎవరు నమ్ముతారు..? అని ప్రశ్నించారు. జగన్ రాజ్యాంగబద్దంగా ఎన్నికైన సీఎమ్మేనా..? అని నిలదీశారు. కోర్టుల్లో కేసులుంటే విశాఖ వెళ్లి కాపురం పెడతానంటారా..? తెల్లవారితే సోషల్ మీడియా ద్వారా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.